తెలంగాణా ఎన్నికల ఏడాది 2వేల నోట్ల ఉపసంహరణ ఎఫెక్ట్.. ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్!!
రెండు వేల నోట్ల ఉపసంహరణ ఎఫెక్ట్ దేశం మొత్తంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువ పడుతుందని రాజకీయ వర్గాలను ప్రజలను చర్చ జరుగుతుంది. మరో ఐదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎన్నికలకు రెడీ అయ్యారు.
ఇక ఈ సమయంలో రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం ఎన్నికలకు అర్ధ బలాన్ని సిద్ధం చేసుకున్న రాజకీయ పార్టీలకు షాక్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రభావం ఏ పార్టీ పై ఎక్కువగా ఉంటుంది? అన్నది ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని, మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును పొందడానికి కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ఆర్థిక వనరులను, అన్ని శక్తులను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఆర్బీఐ నిర్ణయం ముఖ్యంగా సీఎం కేసీఆర్ కు షాక్ అని చెప్పాలి. ఇప్పటికే దేశంలో మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కలిసొచ్చే పార్టీలకు ఎన్నికల కోసం పెట్టుబడి పెట్టేందుకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అని గతంలోనే ప్రకటన చేశారు. ఇక ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దగ్గర దేశంలో ఎన్నికలకు ఆర్థికవనరులు సమకూర్చడానికి కావలసినంత డబ్బు ఉంది అన్నది తెలంగాణ సమాజంలో జరిగిన చర్చ.

ముఖ్యంగా 2 వేల రూపాయల నోట్ల కట్టలు బీఆర్ఎస్ నాయకులే బ్లాక్ చేశారని ఒక అంచనా. ఈ సమయంలో ఈ సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో, 2000 నోట్లు ఉపసంహరణ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ గా మారుతుందని, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు భావిస్తున్నారు. ఇక 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బిఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు.
బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి, హరీష్ రావు వంటివారు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని, ఇది మూర్ఖపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపసంహరణపై ఏ పార్టీ నేతలు స్పందించనంతగా బీఆర్ఎస్ నేతలు స్పందించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్ర అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నా, బిఆర్ఎస్ ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు ఇది కేంద్రం వేసిన సూపర్ స్కెచ్ అన్న చర్చ కూడా జరుగుతుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications