విషాదం: విద్యుత్ షాక్‌తో తల్లీకూతురు సజీవదహనం
నిజామాబాద్: నగరంలోని బ్రహ్మపురి కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున విద్యుదాఘాతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్నతల్లీకూతురు సజీవదహనమయ్యారు. ఆ ఇంట్లో పొగలు రావడాన్ని చూసిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్పటికే తల్లీకూతురు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. నిజామాబాద్ డిఎస్పీ ఆనంద్ కుమార్, సిఐ యాదయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

తెలంగాణ టూరిజం బస్సుకు ప్రమాదం
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో తెలంగాణ టూరిజం బస్సు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్‌ను తప్పించబోయి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ ఏపీ 09 టీఏ 5703.
వరంగల్‌లో భారీ చోరీ
వరంగల్ జిల్లాలోని నాయుడు పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న మూడు ఇళ్లల్లో భారీ చోరీ జరిగింది. ఇళ్లల్లోకి చొరబడిన దొంగలు భారీగా వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications