రాజ్ భవన్ లో దొంగతనం - కీలక ఫైల్స్ మాయం..!!

భారీ భద్రత ఉండే రాజ్ భవన్ లో దొంగలు పడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గవర్నర్ అధికారిక కార్యాలయం ఉండే ఇక్కడ చోరీ జరగటం సంచలనంగా మారింది. నాలుగు హార్డ్ డిస్క్ లు మాయం అయినట్లు గుర్తించారు. సుధర్మ భవన్ లో నాలుగు హార్డ్ డిస్క్ లు కనిపిం చకపోవటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నెల 13న ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ లో దొంగ తనం జరిగింది. దీని పైన అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసారు. రాజ్ భవన్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న రూమ్ నుంచి ఈ హార్డ్ డిస్క్‌లు మాయం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. గతంలో హర్డ్‌వేర్‌ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిగా పని చేసిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి హార్డ్‌ డిస్కులు ఎత్తుకుపోయినట్టు బయటపడటంతో అతడిని 14వ తేదీ పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హార్డ్‌ డిస్క్​ లను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. గతంలో నిందితుడు శ్రీనివాస్​ పై ఫొటోల మార్ఫింగ్‌కు సంబంధించి కేసు నమోదు కాగా, అతను ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు సమాచారం.

employee-srinivas-arrested-in-hard-disks-stolen-case-in-rajbhavan

మాయమైన హార్డ్‌డిస్క్‌లలో రాజ్‌భవన్ వ్యవహారాలతోపాటు.. కీలకమైన కొన్ని రిపోర్ట్‌లు, ఫైల్స్‌ ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రత్యేకంగా వీటినే ఎందుకు చోరీ చేసారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో పని చేసిన వ్యక్తి ఇప్పుడు ఎలా లోపలికి రాగలిగాడు.. ఎవరు అనుమతి ఇచ్చారని పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలోనూ ఈ వ్యక్తి పైన కేసులు ఉండటంతో.. ఇక్కడ పని చేసిన సమయంలో ఏమైనా ఇలాంటి పనులు చేసాడా అనేది విచారణ చేస్తున్నారు. కాగా, రాజ్ భవన్ లో చోరీ జరగటం అధికారిక వర్గాల్లో సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+