తగ్గుతున్న సిబ్బంది: సింగరేణిలో కార్మికులపై పెరుగుతున్న పనిభారం.. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం దాటవే

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 'బంగారు తెలంగాణ' సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ట్రేడ్ మార్క్ నిర్ణయం. ఆ దిశగా కార్మికులంతా అంకిత భావంతో పని చేయాలని సింగరేణి కార్మికులకు పదేపదే పిలుపునిస్తారు. 2014కు ముందు తెలంగాణ ఏర్పాటైతే వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పదేపదే హామీలు గుప్పించిన నేపథ్యం అధికార తెలంగాణ రాష్ట్ర సమితిది.. ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది. వారసత్వ ఉద్యోగాలపై యాజమాన్యం నోరు మెదపడం లేదు. ప్రభుత్వం కూడా స్పందించడం లేదు.
రోజురోజుకు సంస్థలో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గత పదేండ్లలో సంస్థలో ఏకంగా 26వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి. వాటి స్థానంలో కొత్తగా ఎలాంటి నియామకాలు జరుగలేదు. 2006-07 నాటికి సంస్థలో 82,224 మంది ఉద్యోగులు ఉంటే, 2016- 17 మార్చి నాటికి వారి సంఖ్య 56,282 కి తగ్గిపోయింది. అయినా ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరుగుతున్నట్లు యాజమాన్యం చెప్తోంది. సంస్థలో యంత్రాల వినియోగం పెంచడంతో ఉత్పత్తి పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి.

కార్మికులకు విశ్రాంతి కరువు

కార్మికులకు విశ్రాంతి కరువు

సింగరేణి కార్మికులు యంత్రాలతో సమానంగా పని చేయాల్సిన బలవంతపు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికులకు విశ్రాంతి అనేది కరవవుతున్నది. ఫలితంగా భారీ సంఖ్యలో కార్మికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. 2006 - 07లో 82,224 మంది కార్మికులు సంస్థలో పని చేస్తుండగా, బొగ్గు ఉత్పత్తి 37.71 మిలియన్‌ టన్నులు మాత్రమే. కానీ 2016-17 నాటికి ఉద్యోగుల సంఖ్య 56,282 కి తగ్గిపోయినా బొగ్గు ఉత్పత్తి 61.34 మిలియన్‌ టన్నులకు చేరింది.

KCR Government Cheats sheep farmers
నియామకాలపై ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు

నియామకాలపై ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు

ఆయా విభాగాల్లో తరిగి పోయిన కార్మికుల సంఖ్య స్థానంలో యాజమాన్యం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పేరుతో నియామకాల్ని చేపట్టింది. వారికి కనీస వేతనాలు పెంచడం లేదు. సంస్థలో పర్మినెంట్‌ కార్మికులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌ పేరుతో ప్రయివేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి కనీస వేతనాల్ని అమలు చేయడం లేదు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం, యాజమాన్యం స్పందించట్లేదు. వారసత్వ ఉద్యోగాలపై ఇప్పటికీ స్పష్టత లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. దీనిపై సింగరేణి కార్మిక సంఘాలు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. అయినా యాజమాన్యం కానీ, రాష్ట్ర ప్రభుత్వంకానీ ఖాళీ పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత లేని యాజమాన్యం

వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత లేని యాజమాన్యం

తెలంగాణ ఏర్పడ్డాక సింగరేణిలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భావించిన నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తగ్గిన వారసత్వ ఉద్యోగాల విషయంలోనూ స్పష్టత లేదు. న్యాయస్థానం ఈ తరహా నియామకాలు చెల్లవని చెప్పడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. ఇదే డిమాండ్‌పై సింగరేణిలోని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిస్తే దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయే తప్ప, అసలు సమస్య పరిష్కారం కాలేదు.

ఓపెన్ కాస్ట్ గనులతో బొగ్గు తవ్వకం

ఓపెన్ కాస్ట్ గనులతో బొగ్గు తవ్వకం

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్‌ నుంచి దాదాపు మరో 2,300 మంది పదవీ విరమణ చేస్తారు. దీంతో ఇక్కడి ఉద్యోగుల సంఖ్య 54 వేలకు చేరనున్నది. ప్రస్తుతం సింగరేణిలో 34 అండర్‌ గ్రౌండ్‌, 16 ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు వెలికితీత పనులు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని బొగ్గు గనులకు విస్తరిస్తామని యాజమాన్యం ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. దానికి తగినట్టు కార్మికుల సంఖ్యను పెంచకుండా, యంత్రాల వినియోగం అధికం చేసి, దానికి సమాంతరంగా కార్మికుల శ్రమశక్తిని పిండుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. వారసత్వ ఉద్యోగాల కోసం సంస్థకు ఏడువేల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వారిని దశలవారీగా తీసుకుంటామని గతంలో సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.

40 - 45 మధ్య వీఆర్ఎస్ తీసుకోవాల్సిన పరిస్థితి

40 - 45 మధ్య వీఆర్ఎస్ తీసుకోవాల్సిన పరిస్థితి

తొలివిడతలో ఏడాది సర్వీసు ఉన్నవారి పిల్లల్ని వారసత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని నమ్మ బలికింది. ఈ లెక్కన తొలి విడతలో దాదాపు 2,500 మందికి అవకాశం ఉంటుంది. కానీ వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం స్పందించక ఇప్పుడు ఇవి కూడా సందిగ్థావస్థలో పడ్డాయి. సహజంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు 58 ఏళ్లకు రిటైర్‌మెంట్‌ అవుతారు. కానీ సింగరేణిలో 40-45 సంవత్సరాలకే స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకోవాల్సి వస్తున్నదని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి లేఖలు రాసాం, ఇప్పటికే కొన్ని పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపట్టామని సింగరేణి సీడీఎం జనరల్ మేనేజర్ జే నాగయ్య తెలిపారు. త్వరలో వారంతా విధులుల్లో చేరతారన్నారు. సంస్థ విస్తరణ జరిగితే ఉద్యోగుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Employees reducing in Singereni Mines
Please Wait while comments are loading...