దిగిపోవాలి: గవర్నర్‌పై ఎర్రబెల్లి, బాబును అరెస్టు చేయాలని యాదవరెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేత కాకపోతే దిగిపోవాలని ఆయన గవర్నర్‌ను ఉద్దేశించి అన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడానికి ఎసిబి అధికారులు వస్తున్నారని ఆయన అన్నారు.
వేం నరేందర్ రెడ్డికి ఎసిబి అధికారులు నోటీసులు ఇవ్వలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమకు ఎవరికి కూడా నోటీసులు అందలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ స్పందించడం లేదని ఆయన అన్నారు.

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తొలి ముద్దాయిగా చేర్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ యాదవ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబును తక్షణమే అరెస్టు చేయాలని ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
కేసు నుంచి బయపడేందుకు సహకరించడం లేదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు గవర్నర్ నరసింహన్‌పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఇదే గవర్నర్‌ను కొనసాగించాలని టిడిపి నేతలు కోరారని యాదవ రెడ్డి గుర్తు చేశారు. ఇరు ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబే గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications