నా వల్లే కడియంకు మంత్రి పదవి: ఎర్రబెల్లి, దళితుల పూజలను అడ్డుకున్న అగ్రవర్ణాలు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై ఆ పార్టీకి చెందిన నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గిరిజన దీక్ష ముగింపు కార్యక్రమంలో సోమవారం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా నేర్చుకోవాలని అన్నారు.

గిరిజన తండాలకు మేలు చేసింది చంద్రబాబేనని అన్నారు. తాను మంత్రిని కావాలనుకుంటే నిమిషం పట్టదని, కడియం శ్రీహరికి తన దయ వల్లే మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. తాను ప్రజల మనిషినని, అందుకే ప్రతిసారి గెలుస్తానని చెప్పుకొచ్చారు.

Errabelli Dayakar Rao in girijana deeksha at warangal

దళితుల పూజలను అడ్డుకున్న అగ్రకులస్తులు

రాష్ట్రంలో వర్షాలు కురవాలంటూ వరంగల్‌లో దళితులు చేస్తున్న పూజలను అగ్రకులస్తులు అడ్డుకున్న సంఘటన జిల్లాలోని లింగాలఘనపురం మండలం జీడికల్‌‌లో చోటు చేసుకుంది. జీడికల్‌లోని స్ధానిక గుడిలో దళితులు చేస్తున్న పూజలను అగ్రకులస్తులు అడ్డుకున్నారు.

దళితులు గుడిలోకి వస్తే దేవుడు మైల పడతాడని అగ్రకులస్తులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+