టీలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి: కేసీఆర్‌పై ఎర్రబెల్లి ఫైర్
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్, సీతక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే అన్నారు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యాక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్‌కు పలువురి టీటీడీపీ నేతల నివాళి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారకరామారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు టీటీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఎర్రబెల్లి దయాకర్, రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల్పరించారు.
పాలమూరుకు కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహబూబ్ నగర్‌కు చేరుకున్నారు. ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన పాలమూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications