హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సౌమ్యను చంపింది అతనే!: ఎవరీ ప్రకాష్?.. ఆరోజు రాత్రి ఏం జరిగింది?

|
Google Oneindia TeluguNews

Recommended Video

డబ్బు విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణం

హైదరాబాద్: ఎర్రగడ్డలో సంచలనం సృష్టించిన గృహిణి సౌమ్య హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సౌమ్య భర్త నాగభూషణం స్నేహితుడైన ప్రకాష్ ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. డబ్బు విషయంలో తలెత్తిన వివాదమే.. ఘర్షణకు దారి తీసి చివరకు హత్య దాకా వచ్చినట్టు ఒక అంచనాకు వచ్చారు.

ఎన్నో అనుమానాలు: సౌమ్యది హత్యే?, నువ్వెల నూనె పోసి మరీ..ఎన్నో అనుమానాలు: సౌమ్యది హత్యే?, నువ్వెల నూనె పోసి మరీ..

ఎవరీ ప్రకాష్?:

ఎవరీ ప్రకాష్?:

విశాఖపట్టణానికి చెందిన నాగభూషణం, అదే ప్రాంతానికి చెందిన సౌమ్యల వివాహం 2012లో జరిగింది. ఉద్యోగరీత్యా నాగభూషణం అసోంలో నవయుగ కన్‌స్ట్రక్షన్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా చేరాడు. భార్యను కూడా వెంట తీసుకువెళ్లాడు. అదే సంస్థలో పని చేసే పత్తిపాటి సురేశ్‌ ఈ దంపతులకు పరిచయమయ్యాడు.

నాగభూషణంతో ఉన్న పరిచయంతో తరుచూ ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో సౌమ్యతో సాన్నిహిత్యం పెరిగింది. 2016లో హైదరాబాద్‌ మెట్రో రైలులో ఉద్యోగం రావడంతో నాగభూషణం, సహ ఉద్యోగి సురేశ్‌ తిరిగి వచ్చారు.

ఆరోజు రాత్రి ఏం జరిగింది..:

ఆరోజు రాత్రి ఏం జరిగింది..:

నాగభూషణం, సురేష్ ఇద్దరూ హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. సురేష్ తరుచుగా నాగభూషణం ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2న సురేష్.. నాగభూషణం ఇంటికి రాగా.. ఇద్దరు కలిసి మద్యం సేవించారు.

భోజనం చేశాక నాగభూషణం విధులకు వెళ్లగా.. ప్రకాష్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో డబ్బు విషయమై సౌమ్య-ప్రకాష్ ల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది.

ఏం జరిగి ఉంటుంది?: అర్థరాత్రి.. ఎర్రగడ్డలో వివాహిత సజీవ దహనం?ఏం జరిగి ఉంటుంది?: అర్థరాత్రి.. ఎర్రగడ్డలో వివాహిత సజీవ దహనం?

 డబ్బు వివాదం.. హత్య:

డబ్బు వివాదం.. హత్య:

ప్రకాష్ డబ్బు అడగడంతో సౌమ్య తిరస్కరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా.. పెనుగులాటలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయబోగా.. భయపడిన ప్రకాష్ కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె బతికి ఉంటే ప్రమాదమని భావించి.. నూనె పోసి నిప్పంటించి, బయట తలుపుకు గడియపెట్టి పరారయ్యాడు.

కాల్ డేటా ఆధారంగా..:

కాల్ డేటా ఆధారంగా..:

ప్రస్తుతానికి పోలీసులు ఈ వివరాలన్నింటిని గోప్యంగా ఉంచారు. శనివారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాగా, కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రకాష్ ఆమె ఫోన్‌ను ఫ్లష్‌ ట్యాంకులో పడేశాడు. దీంతో విచారణ ఆలస్యమైంది. ఆమె కాల్ డేటా, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించినట్టు సమాచారం.

English summary
Police chased the Soumya's murder mystery in Erragadda. They find out her husband Nagabhushanam friend Prakash is killed her
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X