హుజరాబాద్ లో ఈటల ఒంటరే.!గంగుల కమలాకర్ తో చేయి కలుపుతున్న రాజేందర్ వర్గం.!

హుజరాబాద్/హైదరాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు, మరో గులాబీ మంత్రి గంగుల కమలాకర్ కు మద్య అంతర్గత యుద్దం కొనసాగుతూనే ఉంది. హుజరాబాద్ నియోజక వర్గంలో ఈటల రాజేందర్ ను ఒంటరి వాడిని చేసేందకు గంగుల కమలాకర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో భాగంగా ఈటల అనుచరులను తమవైపు తిప్పుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల అభిమానులు కాకుండా తటస్తంగా ఉన్నస్థానిక నాయకులతో మంత్రి గంగుల కమలాకర్ మంతనాలు జరుపుతున్నట్టు ఉమ్మడి కరీంనగర్ లో చర్చ జరగుతోంది. మీడియా సమావేశాల్లో ఈటల రాజేందర్ పై విరుచుకుపడుతున్న మంత్రి కమాలకర్ భవిష్యత్తులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనకు రాజకీయంగా ఎదురు లేకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

Etala alone in Huzarabad.!Rajender group joining hands with Gangula.!

అందులో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల ప్రభావాన్ని తగ్గిస్తే తనకు ఎదురుండదనేది గంగుల వ్యూహంగా తెలుస్తోంది.అందుకోసం తెర వెనక ఈటలకి వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందింస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా గులాబీ పార్టీకి మద్దతుగా మంత్రి గంగుల కమలాకర్ ను సంప్రదిస్తున్నారు కొంతమంది సర్పంచ్ లు ఎంపిటిసిలు ,కౌన్సిలర్లు. ఈ పరిణామాలతో హుజరాబాద్ నియోజకవర్గం లో కీలక ప్రాంతమైన జమ్మికుంట ఏరియాలో ఈటెల శిబిరం సంపూర్ణంగా ఖాళీ అయినట్టేననే చర్చ జరుగుతోంది. జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, 9మంది ఎంపీటీసీలు, 15మంది సర్పంచ్ లు ముగ్గురు సింగిల్ విండో చైర్మన్ లు మంత్రిని సంప్రదించారు. జమ్మికుంట ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపి పోల్సాని తిరుపతి రావు తో పాటు తొమ్మిది మంది ఎంపీటీసీలు జమ్మికుంట సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాదిరెడ్డి వెంకట్ రెడ్డిల ఆధ్వర్యంలో పదిహేను మంది సర్పంచులు ముగ్గురు చైర్మన్లు మంత్రి గంగుల కమలాకర్ ని కలిసి టిఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఈటల ఒంటరి వాడు కాక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+