హుజురాబాద్ శ్రేణులపై ఈటల విష ప్రచారం.!అమ్ముడుపోయే క్యాడర్ కాదన్న మంత్రి గంగుల.!

కరీంనగర్/హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ అంశం వాడివేడిగా కొనసాగుతోంది. ఈటల రాజేందర్ కు కౌంటర్ ఇచ్చేందుకు అదే జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ పూర్తి బాద్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ లో ఏ ఒక్క కార్యకర్త కూడా ఈటల వెంట నడిచే ప్రసక్తి లేదని, పార్టీ శ్రేణుల్లో అభద్రతాభావం రగిలించే క్రమంలో అమ్ముడుపోయారనే వ్యాఖ్యలు చేస్తున్నారని ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు కమలాకర్. గంగుల కమలాకర్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎపిసోడ్స్ కొనసాగుతుండడంతో జిల్లాల రాజకీయం మరొక్క సారి వెడెక్కింది.

Recommended Video

    Telangana Minister Reacts On Ys Sharmila New Party
    ఈటల రాజేందర్ తప్పుడు ప్రచారం.. పార్టీ శ్రేణులు అమ్ముడుపోలేదన్న మంత్రి కమలాకర్..

    ఈటల రాజేందర్ తప్పుడు ప్రచారం.. పార్టీ శ్రేణులు అమ్ముడుపోలేదన్న మంత్రి కమలాకర్..


    హుజారాబాద్లో ఈటెల రాజెందర్ పూర్తిగా ఒంటరివాడయ్యాడని, గత కొన్ని రోజులుగా ఆయనకు మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులు కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి బహిరంగంగా మద్దతు తెలియజేశారని గంగుల వర్గం స్పష్టం చేస్తోంది. నియోజకవర్గంలోని సర్పంచు స్థాయి నాయకులు మొదలు, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఛైర్మన్లతో పాటు ప్రధాన నేతలు మంత్రి గంగులని కలిసిన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీలో ఎలాంటి
    వర్గాలు లేవని, టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒకటే వర్గమని, అదే సీఎం చంద్రశేఖర్ రావు వర్గమని గంగుల కమలాకర్ స్పష్టం చేస్తున్నారు.

    హుజురాబాద్లో 99శాతం పార్టీతోనే.. టీఆర్ఎస్ నేతలపై ఈటల అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న గంగుల

    హుజురాబాద్లో 99శాతం పార్టీతోనే.. టీఆర్ఎస్ నేతలపై ఈటల అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న గంగుల


    టీఆర్ఎస్ పార్టీకి బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపి నేతలను ఈటెల రాజెందర్ కలుస్తుండడంతో హుజురాబాద్ పార్టీ క్యాడర్ విసిగిపోవడంతో పాటు కొంత అయోమయం నెలకొందని, దాన్ని తొలగించడానికి తాను ప్రయత్నిస్తున్నానని గంగుల తెలిపారు. హుజురాబాద్ ప్రజలంతా కన్నతల్లిలాంటి పార్టీతోనే ఉంటామని తెగేసి చెపుతున్నారని సీఎం చంద్రశేఖర్ రావు వల్లే తెలంగాణ సంక్షేమంగా ఉందని హుజురాబాద్ ప్రజలు భావిస్తున్నట్టు గంగుల స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారికి సంపూర్ణ అండగా ఉంటామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు

    ఈటల బీజేపి, కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు.. కలత చెందుతున్న గులాబీ శ్రేణులన్న మంత్రి కమలాకర్..

    ఈటల బీజేపి, కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు.. కలత చెందుతున్న గులాబీ శ్రేణులన్న మంత్రి కమలాకర్..


    హుజురాబాద్ నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీకి కట్టుబడి ఉండే నేతలు, ప్రజాప్రతినిధుల వివరాలను పత్రికలకు విడుదల చేశారు మంత్రి కమలాకర్. హుజురాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తో పాటు పార్టీకి చెందిన 23మంది కౌన్సిలర్లు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని వారు ప్రకటించారు. మండలంలోని పార్టీకి చెందిన 11 మంది ఎంపీటీసీల్లో 9 మంది టీఆర్ఎస్ పక్షంలో ఉన్నారని, మండలంలోని సర్పంచుల్లో 19 మందిలో బిజేపి, కాంగ్రెస్ గెలిచిన ఒక్కోస్థానాన్ని వదిలేస్తే మిగతా 16మంది పూర్తిగా పార్టీతోనే ఉన్నారన్నారని, ధీంతో హుజురాబాద్ లో 94శాతం ప్రజాప్రతినిదులు పార్టీతోనే ఉన్నారని గంగుల గుర్తుచేశారు.

    కేసీఆర్ మీద పూర్తి విశ్వాసం.. అందుకే చెక్కు చెదరని క్యాడర్ ఉందన్న జిల్లా మంత్రి..

    కేసీఆర్ మీద పూర్తి విశ్వాసం.. అందుకే చెక్కు చెదరని క్యాడర్ ఉందన్న జిల్లా మంత్రి..


    జమ్మికుంట మండలంలోని ఎకైక మున్సిపాలిటీలో 21 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో సహా అందరూ టీఆర్ఎస్ వైపు మెగ్గుచూపుతున్నారని మంత్రి గంగుల తెలిపారు. కో ఆప్షన్ సభ్యులు, ప్యాక్స్ చైర్మన్తోతో సహా మండలంలోని సర్పంచుల్లో 15మంది చంద్రశేఖర్ రావు నాయకత్వానికి జై కొడుతున్నారని, 10మంది ఎంపీటీసీల్లో అందరూ పార్టీతోనే ఉండి 98శాతం టీఆర్ఎస్ తోనే ఉన్నారని పేర్లని విడుదల చేశారు. ఈటెల సొంత మండలం అని చెప్పుకునే ఇల్లందకుంట మండలంలో జడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్, ఎంపీపీతోపాటు 9 మందిలో 3, సర్పంచుల్లో 18 మందిలో 12 మంది టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారన్నారు. దీంతో నియోజక వర్గంలో ఈటల రాజేందర్ పూర్తిగా ఒంటరి వాడయ్యడని కమలకర్ స్పష్టం చేసారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+