వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను కాదు.. కేసీఆర్‌ను శాసనసభకు రాకుండా చేస్తా.. ఆ బాధ్యత నాదే: ఈటల రాజేందర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనను శాసన సభకు రానివ్వనని కెసిఆర్ అనుకున్నట్టున్నాడు కానీ కేసీఆర్ ని సభకు రాకుండా చేసే బాధ్యత నాదేనంటూ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. కచ్చితంగా కేసీఆర్ కు బుద్ధి చెప్పి తీరుతానన్నారు.

కేసీఆర్ ది శంకిణీతనం.. మండిపడిన ఈటల రాజేందర్

కేసీఆర్ ది శంకిణీతనం.. మండిపడిన ఈటల రాజేందర్

కెసిఆర్ ది శంకిణీతనమని మండిపడిన ఈటల రాజేందర్, ప్రధాని నరేంద్రమోడీపై సభా వేదికగా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కేసీఆర్ ఎన్ని రోజులు మోటార్లకు మీటర్ ల గురించి మాట్లాడతారు అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దుబ్బాక లో గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడతారని ప్రచారం చేశారని, హుజురాబాద్ లోనూ బీజేపీ గెలిస్తే విద్యుత్ మోటార్లకు మీటర్లు వస్తాయని, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారని, కానీ మరి రెండు చోట్ల విద్యుత్ మోటార్ లకు మీటర్లు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు

రాష్ట్రంలో మీటర్లకు మోటార్లు రాలేదు.. కానీ కరెంట్ బిల్లుల మోత మోగుతుంది

రాష్ట్రంలో మీటర్లకు మోటార్లు రాలేదు.. కానీ కరెంట్ బిల్లుల మోత మోగుతుంది

సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ నేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీని చూసి భయపడుతున్న కేసీఆర్ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.ఇక రాష్ట్రంలో విద్యుత్ మోటార్ లకు మీటర్లు రాలేదు కానీ, కరెంటు బిల్లుల మోత రాష్ట్రంలో మోగిపోతుంది అంటూ, విపరీతంగా పెంచిన కరెంటు బిల్లులతో రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం ఫీజ్ పీకాల్సిన సమయం ఇదే

కేసీఆర్ ప్రభుత్వం ఫీజ్ పీకాల్సిన సమయం ఇదే

ఇక ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తలకిందులుగా తపస్సు చేసినా సరే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది భారతీయ జనతా పార్టీనే అని తేల్చి చెప్పారు. ప్రజలలో సీఎం కేసీఆర్ పట్ల, టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్న ఈటల రాజేందర్, కెసిఆర్ ప్రభుత్వం ఫీజు పీకవలసిన సమయం ఆసన్నమైందని, ఆ పని ప్రజలందరూ చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరుకాలేదు.

నేడు అసెంబ్లీకి హాజరు కాని ఈటల రాజేందర్ .. కారణం ఇదే

నేడు అసెంబ్లీకి హాజరు కాని ఈటల రాజేందర్ .. కారణం ఇదే

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేపథ్యంలో ఈటల రాజేందర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. మరోవైపు ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నెల ఆరవ తేదీన స్పీకర్ ను మరమనిషిలా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయింది.

ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను ఈటల సమర్ధించుకున్నారు. దీంతో నిండు సభలో ఈటల పై తీర్మానం పెడతారని పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈటల తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

English summary
In the context of the discussion that a resolution will be passed to suspend Etela Rajender from Assembly session, Etela Rajender made sensational comments saying that , I will take the responsibility to prevent KCR from coming to the Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X