కేంద్రంపై ఆచితూచి, దాడి చేస్తే సహించం: తెలంగాణ మంత్రి ఈటెల

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో ఆచితూచి వ్యవహరిస్తున్నామని, తమ హక్కులపై దాడి చేస్తే సహించబోమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రం నిధుల్లో కోత విధించినా, తాము ఏ సంక్షేమ కార్యక్రమాన్నీ విస్మరించడంలేదని ఆయన స్పష్టం చేశారు.

చీప్‌ లిక్కర్‌పై సంపాదించాలనే సంకుచిత ధోరణిలో తాము లేమని తేల్చిచెప్పారు. గుండుంబా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటమే తమ ధ్యేయమని తెలిపారు. ప్రపంచ బ్యాంకును అప్పు అడిగామన్నది కట్టుకథేనని ఈటెల తెలిపారు. తమ షరతులకు లోబడితే ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుంటామని ఈటెల స్పష్టం చేశారు.

 Etela expresses unhappy with union government

ఉద్యోగుల జీతభత్యాలు, ఉపకార వేతనాల విషయాల్లో సమస్యలను అధిగమిస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానని ఎవరూ ఎప్పటికీ శాసించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ గడ్డపై అన్ని పార్టీల జెండాలు మూతపడ్డాయని ఆయన అన్నారు. తక్కువ వడ్డీకి ఇస్తేనే ప్రపంచ బ్యాంకు రుణాలు తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+