ఈటెల అసంతృప్తి... దుబ్బాక విద్యార్థినికి స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణ, వైద్యుల పనితీరుపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు చాలా మంది టైంపాస్ కోసం వచ్చి వెళుతున్నారే తప్ప.. విధులకు హాజరుకావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి డాక్టర్లు స్వచ్ఛందంగా తప్పుకుంటే మంచిదని, లేకుంటే అలాంటి వారి జాబితాను రూపొందించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన ఈటెల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ‘స్వైన్‌ఫ్లూ' నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

Etela Rajender disappointed on doctors regarding their work

దుబ్బాక విద్యార్థినికి స్వైన్‌ఫ్లూ నిర్థారణ

మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన ఓ విద్యార్ధిని అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చేరింది. చికిత్స అందించిన డాక్టర్లు ‘స్వైన్‌ఫ్లూ' లక్షణాలుగా భావించి నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి పరీక్షలు నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్థారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+