తెలంగాణా ఆత్మగౌరవం మంటగలిసింది; పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది!!
రెండవసారి 2018లో అధికారంలోకి వచ్చాక కెసిఆర్ కు కళ్ళు నెత్తికెక్కాయి అని, తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, హక్కులు హరించబడ్డాయి అని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆత్మ గౌరవం మంటగలపబడిందని, తెలంగాణ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ జాతి, కులాన్ని, మతాన్ని.. రాజకీయాలను, జెండాలను పక్కనపెట్టి మూడు తరాలుగా ఉద్యమం చేసింది అన్న ఈటల నాటి పోరాటాలను గుర్తు చేశారు. 1952 ఇండ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం జరిగిందని, 1969 మా ఉద్యోగాలు మాకే కావాలని యువత పోరాటం చేసిందన్నారు.

ఆ పోరాటంలో 369 మంది ముక్కుపచ్చలారని తెలంగాణ మట్టి బిడ్డలు అమరులు అయ్యారన్నారు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ అంతా పాల్గొన్నదన్న ఈటల రాజేందర్ 14 సంవత్సరాల్లో వందలమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. మన నీళ్ళు, మన ఉద్యోగాలు వస్తాయని భావించారు కానీ 2014లో కెసిఆర్ అధికారంలోకి వచ్చాక కొద్దిరోజులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నడిచినా,రెండవసారి 2018లో అధికారంలోకి వచ్చాక కెసిఆర్ కి కళ్ళు నెత్తికి ఎక్కాయన్నారు.
తెలంగాణలో ధర్నాచౌక్ ఎత్తివేశారని, సంఘాలు రద్దు చేశారని మండిపడ్డారు. బిచ్చగాళ్లలా చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పోలీసుల సాయంతో అణచివేస్తున్నారన్నారు. తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అని, ప్రస్తుతం అజ్ఞాత వాసంలో ఉన్నామన్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టి.. సందర్భం వచ్చినప్పుడు ఈ దుర్మార్గ, అహంకార, దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సంకల్పంతో ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల అశయసాధన జరగలేదన్నారు. అది కాకపోగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు . ఆర్టీసీ, మహిళ సంఘాలు, వీఆర్ఏలు, వీఆర్వోలు, రైతాంగం అందరూ ఆవేదనలో ఉన్నారన్నారు. రైతులు దోపిడీకి గురవుతున్నారని, కానీ కేసీఆర్ హర్యానా, పంజాబ్ రైతులకు చెక్కులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ వరి కుప్పల మీద చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం లేదన్నారు .
చేతికి వచ్చిన పంట కళ్లముందే నీళ్లపాలు అయితే హెలికాప్టర్లో వచ్చి ఎకరానికి 10 వేల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగడం మంచిది కాదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో ఏవిధంగా ప్రజలంతా ఐక్యంగా పనిచేశారో.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అందరం కలిసి కట్టుగా ప్రతిజ్ఞ చేయాలని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications