ముగిసిన ఈటల రాజేందర్ విచారణ; కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ పై ఈటల ఫైర్!!
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వరంగల్ జిల్లా పోలీసులు దూకుడు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు వాట్సాప్ గ్రూప్ లకు సంబంధించిన అడ్మిన్ లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు నేడు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను విచారించారు.
ఇప్పటికే పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఏ1 నిందితుడిగా బండి సంజయ్ ని పేర్కొని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పోలీసులు, ఈ కేసులో ఏ2 నిందితుడు అయిన ప్రశాంత్ ప్రశ్నాపత్రాన్ని ఈటల రాజేందర్ కు పంపించారు అన్న కారణంగా ఈ కేసులో ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు పంపించారు. ఇక ఈ క్రమంలో నేడు వరంగల్లో ఈటల రాజేందర్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

పదో తరగతి హింది ప్రశ్న పత్రం లీకేజీ కేసులో వరంగల్ డీసీపీ కార్యాలయంలో హాజరైన ఈటల రాజేందర్ ను పోలీసులు విచారించారు. ప్రశాంత్ తో ఈటల రాజేందర్ కు ఉన్న సంబంధాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్ ని కూడా పరిశీలించారు. దీంతో ఈటల విచారణ ముగిసింది. విచారణ ముగించుకుని బయటకు వచ్చిన ఈటల రాజేందర్ పోలీసులు తన సెల్ ఫోన్ తీసుకొని తన సమక్షంలోనే పరిశీలించారని పేర్కొన్నారు. తాను బాధ్యత గల ప్రజాప్రతినిధినని, అందుకే విచారణకు వచ్చానని వెల్లడించారు.
తనకు ఎటువంటి వాట్సప్ కాల్ రాలేదని, తనకు వచ్చిన మెసేజ్ కూడా తను ఓపెన్ చేసి చూడలేదని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి తప్పుడు పనులకు తమ పార్టీ నేతలు పాల్పడే ఆస్కారమే లేదని పేర్కొన్న ఆయన తను పిల్లల క్షేమం కోరే పార్టీలో ఉన్నానని చెప్పుకొచ్చారు 9.30 కి పరీక్ష మొదలు అయితే 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారు? అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ ప్రగతి భవన్లో కూర్చొని ఎలా అయినా మమ్మల్ని ఇరికించాలని కుట్ర పూరితంగా మా మీద కేసులు పెట్టించారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ఆరు పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయి .. నెగెటివ్ చర్చ జరుగుతుందని దానిని డైవర్ట్ చెయ్యడానికి ఈ కేసులు పెట్టారని చెప్పారు.
ముగిసిన ఈటల రాజేందర్ విచారణ; కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ పై ఈటల ఫైర్..!!#EtelaRajender #KCRGovt #BJP #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/i2UWz4lIxX
— oneindiatelugu (@oneindiatelugu) April 10, 2023
సుఖేష్ చంద్రశేఖర్ కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి రేంజ్ రోవర్ కారులో ఇచ్చానని చెప్తుంటే ఆ చర్చ జరగకుండా పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. లిక్కర్ కేసు పై చర్చ జరగొద్దని, దేశమంతా ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెడతానని కేసీఆర్ చెబుతున్న అంశంపై చర్చ జరగకూడదని ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇది ఒక అక్రమ కేసు అని మండిపడిన ఆయన కెసిఆర్ ని ఓడించేంతవరకు ప్రజల ఆకాంక్షను నెరవేర్చే వరకు ప్రజలకు అండగా ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications