వారు నిప్పు కణికలా? కేసీఆర్ డ్రామాలు మునుగోడు ప్రజలు నమ్మరు: ఈటల రాజేందర్
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్న ఈటల రాజేందర్ తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ తీరు పై నిప్పులు చెరిగారు.

కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ డ్రామాలు: ఈటల రాజేందర్
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి లు నిప్పు కణికలు అంటే నవ్వొస్తుంది అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ డ్రామాలు ఆడించారని బిజెపి నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే స్పీకర్ పై అవిశ్వాసం పెట్టామని గుర్తు చేశారు. 2014లో టిఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని, వారికి డబ్బులు ఇచ్చే కేసీఆర్ చేర్చుకున్నారా అంటూ ఈటల ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చి కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారు
ఇక 2018లో 90 సీట్లలో గెలిచిన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. 2014, 2018లో విపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవిని కట్టబెట్టింది నిజం కాదా అంటూ ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా కనుమరుగవుతుందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలని కెసిఆర్ చూస్తున్నారంటూ ఈటల ఆరోపించారు. మునుగోడు లో కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చి కేసీఆర్ ప్రచారం చేయిస్తున్నారని పేర్కొన్నారు.

బీజేపీ అభ్యర్థికి టీఆర్ఎస్ అభ్యర్థికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా
కెసిఆర్ అహంకారాన్ని, కుటుంబ పాలనను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. మునుగోడులో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు .మునుగోడు ప్రజలు, రైతులు, యువకులు, అన్ని వర్గాల వారు ఒక్కసారి ఆలోచించి మీ నిర్ణయాన్ని తీసుకోవాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

టిఆర్ఎస్ పార్టీ బిజెపిపై బురద జల్లే ప్రయత్నం.. ఓటుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్న ఈటల
మునుగోడులో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ బిజెపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, బిజెపికి ఓటు వెయ్యొద్దు అని దుష్ప్రచారం చేస్తోందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బిజెపికి ఓటు వేస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నేతల ప్రచారం పై మండిపడ్డారు. హుజురాబాద్ లోనూ ఇదే తరహా దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు మునుగోడులోనూ దుష్ప్రచారానికి టిఆర్ఎస్ పార్టీ తెరతీసిందని ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. ఓటుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications