కేసీఆర్ వడ్ల నాటకం వెనుక పీకే సర్వే.. బీజేపీ అంటే భయం అందుకే: ఈటల రాజేందర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారంటూ ఈటల మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలు అబద్ధాల పుట్ట అని, ఆయనను ఎవరూ నమ్మడం లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ధాన్యం కొనుగోలు నాటకం అందుకే మొదలుపెట్టారు అంటూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు ఈటల రాజేందర్.

కెసిఆర్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

కెసిఆర్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

సీఎం కుర్చీ కోసం, కుటుంబ పాలన కోసం, లక్షల కోట్ల రూపాయల సంపాదన కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాటపడుతున్నారు తప్పా ప్రజల కోసం కాదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కెసిఆర్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని వడ్ల సమస్య, తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఉందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కావాలని కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనడం లేదని చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

ధర్నాలు,రాస్తారోకోలు చేయించటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం

ధర్నాలు,రాస్తారోకోలు చేయించటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం

కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా మారిందని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ధర్నాలు చేయవద్దని చెప్పిన సీఎం ఇప్పుడు తానే స్వయంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తూ ఉండటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఈటల విమర్శించారు. పెన్షన్ ల పేరుతో వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అంటే కేసీఆర్ కు భయం.. అందుకే గంటల కొద్దీ ప్రెస్ మీట్లు

బీజేపీ అంటే కేసీఆర్ కు భయం.. అందుకే గంటల కొద్దీ ప్రెస్ మీట్లు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం చెలాయిస్తున్న కుటుంబం కెసిఆర్ కుటుంబం అని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయమైనా కేసీఆర్ ఒక్కడే తీసుకుంటాడని, ఎమ్మెల్యేలను,మంత్రులను కేసీఆర్ పట్టించుకోడని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ అయోమయంలో పడ్డాడని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎప్పుడైనా గంటలకొద్దీ ప్రెస్ మీట్ లో పెట్టారా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్, బిజెపి పట్ల భయం తో ఇప్పుడు గంటలకొద్దీ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అనర్ధాలకు కారణం

ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అనర్ధాలకు కారణం

రాష్ట్రంలో భవిష్యత్ కాలంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పిన ఈటల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ ఫలితాలు రిపీట్ అవుతాయి అంటూ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని డిమాండ్ చేసిన ఈటల రాజేందర్, ఒకప్పుడు ఉద్యమ నేతగా కెసిఆర్ ను గౌరవించిన ప్రజలు, ఇప్పుడు సీఎంగా కేసీఆర్ వైఖరి పట్ల అసహ్యించుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అనర్ధాలకు కారణం గా మారుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

పీకే సర్వేలో కేసీఆర్ పై వ్యతిరేకత అందుకే వడ్ల నాటకం

పీకే సర్వేలో కేసీఆర్ పై వ్యతిరేకత అందుకే వడ్ల నాటకం

కేంద్రం పార్లమెంట్ లో ముడి బియ్యం కొనుగోలు చేస్తామని చెప్పిందని కానీ, కెసిఆర్ స్వప్రయోజనాల కోసం ఉప్పుడు బియ్యం కొనాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తేలిందని, అందుకే పంజాబ్ విధానం ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపించారు. శాసన సభలో ఉంటే అధికార పార్టీలో లొసుగులు బయటపెడతానని తనను సస్పెండ్ చేసి బయటకు పంపించారని ఆరోపించారు. కెసిఆర్ తన గొంతు నొక్కాలని చూస్తే, ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు అంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+