• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వచ్ఛ హైదరాబాద్ లో అందరి భాగస్వామ్యం కావాలి.!మరింత కష్టపడాలన్న మంత్రి కె.టి.ఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దిశానిర్దేశంతో స్వచ్ఛ హైదరాబాద్ లో ప్రతిఒక్కరూ భాగస్వాములై పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి, ఐటి చేనేత పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సోమవారం సనత్ నగర్ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన 1350 స్వచ్ఛఆటోలను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్దక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోం మంత్రి మహమూద్ ఆలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ లోకేష్ కుమార్ లతో కలిసి 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు.

 చెత్త సేకరణ వాహనాల పంపిణీ.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వచ్చేలా కృషి చేయాలన్న మత్రి కేటీఆర్

చెత్త సేకరణ వాహనాల పంపిణీ.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వచ్చేలా కృషి చేయాలన్న మత్రి కేటీఆర్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో బాగంగా సిఎం చంద్రశేఖర్ రావు స్వచ్ఛ హైదరాబాద్ నగరం పరిశుభ్రంగా ఉండే ఉద్దేశ్యంతో 2500 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో 40లక్షల పైబడిన జనాభా విభాగంలో హైదరాబాద్ నగరానికి అవార్డు వస్తున్నాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కూడా అవార్డు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు మంత్రి కేటీఆర్. మూడు, నాలుగు గంటలు శ్రమపడి ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు మునిపల్ సిబ్బంది హైదరాబాద్ నగర ప్రజల తరుపున అభినందనలు తెలిపారు.

 చెత్త తరలింపులో వాహనాలు కీలక పాత్ర.. క్లీన్ సిటీ లక్ష్యంగా పనిచేయాలన్న కేటీఆర్

చెత్త తరలింపులో వాహనాలు కీలక పాత్ర.. క్లీన్ సిటీ లక్ష్యంగా పనిచేయాలన్న కేటీఆర్

సఫాయి అన్న సాలం అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాటలతోనే సరిపెట్టకుండా మూడుసార్లు గౌరవ వేతనం పెంచినట్లు చెప్పారు.
2500 స్వచ్ఛ అటోల పంపిణీ కంటే ముందు, హైదరాబాద్ నగరంలో 3500 మెట్రిక్ టన్నుల చెత్త వ్యర్థాలను సేకరించేవారన్నారు. ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తున్నారని గుర్తు చేసారు. నేటికీ అది 6500 మెట్రిక్ టన్నుల వరకూ సేకరణ చేయడం జరుగుతున్నదని అన్నారు. వాహనాల ద్వారా సేకరించిన చెత్తను సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తరలించి అక్కడ నుండి డంప్ యార్డుకు తరలిస్తున్నారని, తద్వారా మెరుగైన పారిశుద్ద్యానికి వెసులుబాటు కలిగిందనొ, జిహెచ్ఎంసి పరిధిలో 1350 స్వచ్ఛ ఆటోలు కలిసి మొత్తం 4500 ఆటోలు ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్.

 దక్షిణ భారతదేశంలో అతి పెద్ద చెత్త డంప్ యార్డ్.. 28 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి సన్నాహాలన్న కేటీఆర్

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద చెత్త డంప్ యార్డ్.. 28 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి సన్నాహాలన్న కేటీఆర్

దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన చెత్త నుండి విద్యుత్తు (వేస్ట్ టు ఎనర్జీ) ప్లాంట్ జవహర్ నగర్ లో జిహెచ్ఎంసి ద్వారా మొట్టమొదటగా 20మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ ను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. మరో 28 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినందున మొత్తం 48మెగావాట్ల విద్యుత్తు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించడం, దక్షిణ భారతదేశంలో అతి పెద్దది కావడం విశేషమాన్నారు. 1350 స్వచ్ఛ ఆటోల వలన నగరంలో మూలమూలకు విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్యం మెరుగు పడుతుందని, కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కొరకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

 పరిశుభ్ర నగరమే లక్ష్యం.. మున్సిపల్ సిబ్బంది మరింత కష్టపడాలన్న మంత్రి తలసాని..

పరిశుభ్ర నగరమే లక్ష్యం.. మున్సిపల్ సిబ్బంది మరింత కష్టపడాలన్న మంత్రి తలసాని..

రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో బాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారన్నారు. జిహెచ్ఎంసిలో తడి, పొడి చెత్త సేకరణ కొరకు ఆటోల పంపిణీ మంచి ఆలోచనలతో తీసుకున్న నిర్ణయమన్నారు. రెండోసారి 1350 ఆటోల పంపిణీ వలన హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగు పడుతుందని తలసాని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, ప్రియాంక అలా, ఖైరతాబాద్ జడ్.సి రవి కిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, డి.సి లు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మి బాల్ రెడ్డి, బేగం పేట్ కార్పొరేటర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

English summary
State Municipal, Urban Development and IT Industries Minister K Taraka Rama Rao said that under the direction of Chief Minister Chandrasekhar Rao, everyone in Swachha Hyderabad should be partners and make it a complete success. The 1350 clean autos set up at the Sanath Nagar playground on Monday were formally launched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X