ఎవరా వ్యక్తి?: కావాలనే విజయరామారావు కొడుకుని ఇరికించారా?
హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్ వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కళ్యాణ్ శ్రీనివాస్‌ను కొందరు పెద్దలు ఉద్దేశపూర్వకంగా ఇరికించనట్టుగా ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తన కుమారునిపై బ్యాంకు రుణాల ఎగవేత కేసు నమోదు కావడంపై విజయరామారావు తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. సోమవారం ఢిల్లీలో ఉన్న ఆయన, కేసు పూర్తి వివరాలు తెలుసుకోకుండా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అయితే.. ఈ కేసులో తన కుమారుని ప్రమేయం మాత్రమే ఉందని తాను భావించట్లేదని ఆయన అన్నారు.
మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగివస్తున్న విజయరామారావు బుధవారం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. తన కొడుకొక్కడే ఈ పని చేసి ఉండడని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారని సమాచారం.
కాగా బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టడానికి ముందు కళ్యాణ్ శ్రీనివాస్ కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్‌లోని పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. కల్యాణ్‌రావు కుటుంబ సభ్యులకు తెలిసి ఆయన ఇంకా సుజనా గ్రూప్‌కు సంబంధించిన కంపెనీల్లోనే ఉద్యోగిగా ఉన్నారు.

అంతేకాదు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎండీగా బాధ్యతల నిర్వహణ కూడా అందులో భాగమేనని వారి అభిప్రాయపడుతున్నారు. కళ్యాణ్ శ్రీనివాస్ సోదరి అన్నపూర్ణ మీడియాతో ఇదే విషయం చెప్పిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా వందల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన కేసులో సీబీఐ కళ్యాణ్ శ్రీనివాస్‌ను నిందితునిగా చేర్చడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కళ్యాణ్ శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితమే కుమార్తె పెళ్లి చేశారని పెళ్లి ఖర్చుల కోసం ఆయన ఇబ్బంది పడిన విషయం తమకు తెలుసనని ఆయన సన్నిహిత మిత్రుడొకరు తెలిపారు. ఉద్యోగం విషయంలో ఆయన కొంతకాలంగా తీవ్ర ఆందోళనగా ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు.
ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి చెప్పబట్టే ఆయన సంతకాలు చేసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కళ్యాణ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు చెబుతున్న విషయాలను బట్టి చూస్తే కేంద్రమంత్రి, సుజనా గ్రూప్ వ్యవస్థాపకులు సత్యనారాయణ చౌదరి పాత్రపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా సుజనా చౌదరికి భాగస్వామ్యం ఉందా అన్న విషయం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇతర అనుబంధ సంస్థలతో పాటు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌ను కూడా విలీనం చేసుకోవాలని 2009లో మాతృసంస్థ నిర్ణయించింది.
ఈ నిర్ణయం మేరకు ఇతర కంపెనీల విలీనం జరిగింది కానీ.. బెస్ట్ అండ్ క్రాంప్టప్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్‌ను మాత్రం బయట వ్యక్తులకు విక్రయించారు. 2013 సెప్టెంబర్ నాటి రికార్డుల ప్రకారం ఈ సంస్థలో ఇరవై మంది వాటాదారులున్నారు. ఇందులో ఒక సంస్థ మైక్రోపార్ట్ ఇంటర్‌నేషనల్. ఇది సీషెల్స్ కేంద్రంగా ఉంది. 2013 తర్వాత ఈ సంస్థ ఆర్‌వోసీలో రిటర్న్స్ దాఖలు చేయలేదు.
గత ఏడాది సెప్టెంబర్‌లో బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌ను.. మారిషస్ కేంద్రంగా ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కోనేరు హోల్డింగ్స్ లిమిటెడ్ టేకోవర్ చేసింది. సోకాన్ హోల్డింగ్స్, పీవీకే ఇంజనీర్స్, బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ సంస్థలను కోనేరు హోల్డింగ్స్ సొంతం చేసుకోవడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
బయట దేశాల్లో నమోదైన కంపెనీలుండటం, దేశీయంగా రిజిస్టరైన కంపెనీల్లోనూ ఈక్విటీ హోల్డింగ్ రకరకాల మెలికలతో ఉండటంతో అసలు యజమానిని గుర్తించడం కష్టమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా సీబీఐ సమన్లు జారీ చేసిన ప్రస్తుత కేసులో బ్యాంకు రుణాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో చేసిన నాలుగు కంపెనీల వెనక ఉన్న వ్యక్తులను గుర్తిస్తే తప్ప కేసులో కళ్యాణ్ శ్రీనివాస్ పాత్ర, ప్రమేయాన్ని గుర్తించడం కష్టమే.
అయితే ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు ఈ కేసు విషయంలో ఏ విధంగా వెళతారో అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications