ఎవరి పేర్లూ చెప్పను, అన్నీ మీరే చూస్తారు: కొడుకుపై సీబీఐ కేసు మీద విజయ రామారావు
హైదరాబాద్: వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో తన కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించి అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు.
ఎవరా వ్యక్తి?: కావాలనే విజయరామారావు కొడుకుని ఇరికించారా?
రాజకీయ కక్ష సాధింపుతోనే తన కొడుకును అరెస్ట్ చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తాను ఎవరి పేర్లూ చెప్పనని, ముందు ముందు అన్నీ మీరు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నా జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. ఈ కేసులో మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదన్నారు.

మా అబ్బాయి చాలా అమాయకుడని, కోర్టుకు మీకు త్వరలో అన్ని విషయాలు చెబుతానని అన్నారు. తన కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌పై కేసు పెట్టిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తన కుమారుడిపై పెట్టిన కేసుకు సంబంధించిన ప్రోసీడింగ్స్ చూశానే తప్ప నేను సీబీఐతో ఏమీ మాట్లాడలేదన్నారు.
తాను 20 ఏళ్ల కిందట రిటైర్ అయ్యానని, ప్రస్తుతం తాను సీబీఐ డైరెక్టర్‌ని కానన్నారు. సీబీఐ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం తన కుమారుడి ఇంటిని సెర్చ్ చేశారని అన్నారు. నేను చెప్పిన మాటలు వమ్ము కావన్నారు. నిజాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. సీబీఐ ఆధారాలు చూపించిందని గనుకే తన ఇంటిని సెర్చ్ చేసేందుకు అంగీకరించానన్నారు.
తన కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడని ఆయన చెప్పారు. తనకు అన్ని విషయాలు తెలుసని, ఇప్పుడే అన్ని విషయాలు చెప్తే తన కొడుకు కేసు నుంచి బయట పడటం కష్టం అని తెలిపారు. తన ఆస్తుల విషయానికి వస్తే తన గ్రామంలో ఇల్లు, భూములు ఉన్నాయన్నారు.
అందులో నా కుమారుడికి కూడా వాటా వస్తుందన్నారు. నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం శ్రీనివాస్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications