Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం అదిరిపోయే శుభవార్త, తెలంగాణాకు మరో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే!

తెలంగాణ రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. రోడ్డు రవాణా వ్యవస్థ రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న బలంగా నమ్ముతున్న కేంద్రం రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కావాలని తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలను కూడా కేంద్రం ఆమోదిస్తుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే
తెలంగాణలో రవాణా రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరిగితే ప్రగతి సాధ్యమవుతుందని భావిస్తున్నారు. కేంద్రం ఆమోదిస్తే, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఈ ప్రాజెక్టును చేపట్టనుంది.

Exciting good news another new greenfield expressway for Telangana proposals to center

Take a Poll

రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా
రోడ్లు, భవనాల శాఖ రూపొందించిన అంచనాల ప్రకారం, ఈ కొత్త రహదారి 205 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అని అంచనా. ప్రస్తుతం రాజీవ్ రహదారి సికింద్రాబాద్ నుంచి గోదావరిఖని వరకు విస్తరించి ఉంది. ఇది శామీర్పేట, సిద్దిపేట, కరీంనగర్ మీదుగా గోదావరిఖని వెళుతుంది.

శామీర్‌పేట నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే
అయితే ఎక్కువ మలుపులు ఉండడం కారణంగా ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీనిని విస్తరించి ప్రమాదాలను నివారిద్దాం అని భావించినా, విస్తరించడానికి అవకాశం లేదని అధికారులు తేల్చారు. ఈ సమస్యలకు పరిష్కారంగా, శామీర్‌పేట నుంచి ప్రారంభమయ్యే ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే ప్రస్తుతం రాజీవ్ రహదారికి కుడివైపున నిర్మించబడుతుంది.

ఉత్తర తెలంగాణ ప్రజలకు రవాణా సులభతరం
ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే శామీర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి మొదలై హుస్నాబాద్ మీదుగా వెళ్తుంది. సికింద్రాబాద్-శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్‌తో దీనిని అనుసంధానించనున్నారు.
అంతేకాకుండా, రాష్ట్రంలోని మంచిర్యాల, ఖమ్మం జిల్లాల మీదుగా వెళ్లే నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు ఈ మార్గాన్ని అనుసంధానించాలని కూడా ప్రణాళికలో ఉంది. ఈ అనుసంధానం ఉత్తర తెలంగాణ ప్రజలకు రవాణాను మరింత సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.

కేంద్రం ఆమోదిస్తే ప్రాజెక్ట్ పనులు
ఈ కొత్త మార్గం రాజీవ్ రహదారిపై రద్దీని తగ్గించడం మాత్రమే కాకుండా, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ప్రమాదాలను నివారిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల సంబంధిత ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమై, భూముల ధరలు పెరుగుతాయని కూడా అంచనా. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులు మొదలవుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+