హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుడు పదార్థాల అమ్మకం: నలుగురి అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ తెలిపిన ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటయ్య చిట్యాల సమీపంలోని ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీ నుంచి జిలిటెన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు తీసుకుని ఘట్‌కేసర్‌ వైపు వెళ్లారు.

తారామతిపేట సమీపంలో ఔటర్‌రింగు రోడ్డు వద్ద వాటిని నేరేడుచర్లకు చెందిన వెంకటయ్యకు అమ్మేందుకు యత్నిస్తుండగా.. అక్కడే మాటువేసిన ఎస్‌ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి రెండు వాహనాలు, 1,800 జిలిటెన్‌స్టిక్స్‌, 1,600 డిటోనేటర్లు, రూ.1,43,300 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిలిటెన్‌స్టిక్స్‌, డిటోనేటర్ల రవాణాకు అనుమతి ఉన్నా వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై విచారణ సాగిస్తున్నారు.

సీజ్ చేసిన పేలుడు పదార్థాలు

సీజ్ చేసిన పేలుడు పదార్థాలు

పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు

నిందితులు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటయ్య చిట్యాల సమీపంలోని ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీ నుంచి జిలిటెన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు తీసుకుని ఘట్‌కేసర్‌ వైపు వెళ్లారు.

సీజ్ చేసిన బొలెరో

సీజ్ చేసిన బొలెరో

తారామతిపేట సమీపంలో ఔటర్‌రింగు రోడ్డు వద్ద వాటిని నేరేడుచర్లకు చెందిన వెంకటయ్యకు అమ్మేందుకు యత్నిస్తుండగా.. అక్కడే మాటువేసిన ఎస్‌ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పేలుడు పదార్థాలు

పేలుడు పదార్థాలు

నిందితుల నుంచి రెండు వాహనాలు, 1,800 జిలిటెన్‌స్టిక్స్‌, 1,600డిటోనేటర్లు, రూ.1,43,300 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

English summary
The Hayathnagar police on Wednesday seized a huge quantity of explosive material stored illegally. They took Four persons into custody and seized a Bolero used for transporting the material.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X