అక్రమ సంబంధంపై భర్త మందలింపు: భార్య, ఆమె ప్రియుడు ఆత్మహత్య
ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంపై భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య విషయం తెలిసిన ఆమె ప్రియుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడు.
ఆ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో శనివారంనాడు జరిగింది. మొండికుంట గ్రామానికి చెదిన శెట్టిపల్లి అశ్విని (20) కి ఆరు నెలల క్రితం పెళ్లయింది. అయితే, అంతకు ముందే ఆమె నర్సింహులు అనే యువకుడిని ప్రేమించింది.

పెళ్లి తర్వాత కూడా ఆమె ప్రియుడితో సంబంధం కొనసాగించింది. ఇది తెలిసి భర్త పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టాడు. అయినా ఆమె తన తీరు మార్చుకోలేదు. దీంతో ఆమెను భర్త శుక్రవారంనాడు మందలించాడు. మనస్తాపానికి గురైన అశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
అశ్విని ఆత్మహత్య విషయం తెలిసిన నర్సింహులు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ వారు శనివారం మరణించాడు.












Click it and Unblock the Notifications