ఉపాధ్యాయుడితో భార్య వివాహేతర సంబంధం: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన భర్త

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివాహిత మహిళ ఓ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం ఆమె భర్తకు తెలిసింది. అతడు సమాచారంతో ఇవ్వడంతో పోలీసులు సదరు మహిళ.. ఉపాధ్యాయుడితో సన్నిహితంగా ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నాగర్‌ కర్నూల్‌కు చెందిన చందునాయక్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో తరచూ ఆమె వద్దకు వెళ్తుండేవాడు.

extramarital affair: A husband complained to police on his wife

కాగా, సదరు ఉపాధ్యాయుడు గురువారం తనింట్లో ఉన్నాడని గుర్తించిన సదరు మహిళ భర్త.. డయల్‌ 100కు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చందు నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ భర్త కూడా ఉపాధ్యాయుడే కావడం గమనార్హం. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహి ళ మృతి చెందిన సం ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయం త్రం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడకు చెందిన ఇస్లావత్ రిషిత(21)గురువారం తన స్నేహితుడైన సాయికిరణ్‌తో కలిసి కారులో వర్గల్ టెంపుల్‌కు వెళ్లింది.

తిరిగి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండల పరిధిలోని ఫారెస్ట్ గెస్ట్‌హౌస్ సమీపంలో రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని బైక్ వీరి కారుకు అడ్డు వచ్చింది. బైక్‌ను తప్పించబోయే క్రమంలో కారు కల్వర్ట్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషితను దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A husband complained to police on his wife for extramarital affair in Hyderabad on Thursday.
Please Wait while comments are loading...