దొంగ బాబా మోసం.. అరెస్టు, చెట్టును ఢీకొన్న బస్సు
ఆదిలాబాద్: ఐదు లక్షలు కొట్టు... ఐదు కోట్లు పట్టు అంటూ ఆదిలాబాద్‌లో తన చేతివాటాన్ని ప్రదర్శించిన దొంగబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా హత్నూర మండలంలో జరిగింది.
ఐదు లక్షలిస్తే, ఐదు కోట్లిస్తానని చెబుతూ ఆ దొంగబాబా తన వద్దుక వచ్చిన భక్తులను చెప్పడంతో... ఓ అమాయక భక్తుడు ఐదు లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత గానీ తెలియిలేదు బాబా చేతిలో తాను మోసపోయానని.

అనంతరం మోసపోయిన భక్తుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగబాబాను అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న దొంగ బాబా ఘనకార్యాల గురించి విచారణ జరుపుతున్నారు.
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 15 మందికి గాయాలు
మెదక్ జిల్లా ఆందోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే చెట్టును ఢీకొట్టిందని ప్రయాణీకులు తెలిపారు. వారి పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications