పీర్ బాబా: నేరుగా దేవుడి దగ్గరకు పంపిస్తానన్నాడు, ఇంకా...

Subscribe to Oneindia Telugu

వరంగల్‌: మాయమాటలతో తమను నమ్మించి డబ్బు కాజేసిన పీర్‌బాబా నుంచి డబ్బులు ఇప్పించి అతడి మనుషుల నుంచి కాపాడాలని ఓ ముస్లిం కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మంత్రాలతో డబ్బు రెట్టింపు చేస్తానని తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు గుంజాడని, చివరకు మోసాన్ని గ్రహించి డబ్బు తిరిగివ్వాలని కోరితే తన మనుషులతో చంపడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితులు సుబేదారి పోలీసుకు ఫిర్యాదు చేశారు.

బాధితులు ఖాజామోయినొద్దీన్‌, అతని భార్య నాజ్‌నీర్‌ మన్సూర్‌తో పాటు సుబేదారి సీఐ అనుము శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.... హన్మకొండ జులైవాడకు చెందిన ఖామోయినొద్దీన్‌ వరంగల్‌ ఎన్‌ఐటీలో ఎంటెక్‌ పూర్తిచేసి 2009లో ఉద్యోగం నిమిత్తం దబాయ్‌కి వెళ్లాడు.

Fake Baba cheats Muslim family at Warangal

ఆ తర్వాత శంభునిపేటకు చెందిన ఆయన వదిన ద్వారా సయ్యద్‌ మస్తాన్‌అలీ అలియాస్‌ అర్మాని బాబా అలియాస్‌ పీర్‌బాబాతో పరిచయం ఏర్పడిరది. మహారాష్ట్రకు చెందిన పీర్‌బాబా పదేళ్లుగా వరంగల్‌లో ఉంటున్నాడు. ఖాజామోయినొద్దీన్‌ వద్ద డబ్బు గుంజాని ప్లాన్‌ వేసిన పీర్‌బాబా మోసానికి తెర తీశాడు. మాయ మాటలతో నమ్మించడం ప్రారంభించాడు. ఎవరైనా చనిపోతే తన మంత్రశక్తితో వారిని నేరుగా దేవుడి వద్దకు పంపిస్తానని చెప్పాడు. దీనిని నమ్మిన ఖాజాకు సర్టిఫికెట్‌ కూడా ఇచ్చి డబ్బు కోసం ముగ్గులోకి లాగాడు.

ధర్మసాగర్‌ మండంలోని ఓ గ్రామంలో దర్గా కడుతున్నానని, ప్రహరీకి డబ్బు సహాయం చేయాలని కోరాడు. ఇలా చేస్తే నీకు ప్రమోషన్‌తోపాటు మూడు రెట్లు డబ్బు అధికం అవుతాయని నమ్మించాడు. దీంతో ఖాజా దుబాయ్‌ నుంచి రూ. 50 వేలు పంపించాడు. ఆ తర్వాత దుబాయ్‌లో కంటే తనవద్ద ఉంటే స్వర్గం చూపిస్తానని ఖాజాను 2013లో వరంగల్‌కు పిలిపించాడు. మీరు ఎంత డబ్బు ఇస్తే అంతకు రెట్టింపు చేసి ఇస్తానని నమ్మించాడు.

అది నమ్మిన ఖాజా కుటుంబ సభ్యులు 2013 నుంచి ఇప్పటి వరకు రూ. 14 క్షు ముట్టజెప్పారు. ఒకమారు రూ. 50 మే, మరోమారు రూ. 2 లక్షలు, మరోమారు రూ. 8 లక్షలు, చివరగా జెన్‌కోలో ఏఈ ఉద్యోగం ఇప్పిస్తానంటే రూ. 3.50 క్షు ముట్టజెప్పినట్లు చెప్పారు. ఇవే కాకుండా తన దర్గా పక్కన వ్యవసాయ భూమి ఉందని, రూ. 11 క్షు ఇస్తే భూమి కొనిస్తానని నమ్మించాడు. దీంతో ఖాజా రూ. 11 లక్షలు కూడా ఇచ్చాడు.

కానీ, భూ యజమాని బూర అశోక్‌ గౌడ్‌ భూమిని బాబా పేరు మీద నోటరీ చేయించాడు. ఈ క్రమంలో భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని ఖాజా కోరగా బాబా స్పందించలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడమ ప్రారంభమయ్యాయి. చివరికి నేరుగా భూ యజమానితో కలిసి ఖాజా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

ఆ తర్వాత తనకు రావాల్సిన రూ. 14 క్షు ఇవ్వాలని ఖాజా కోరడంతో గత మార్చి 29న బాబా తన అనుచరుతో జులైవాడలో ఉంటున్న ఇంటి మీద దాడి చేయించాడు. ఇదిలా ఉండగా రెండు మాసాలకు ఒక ఇల్లు మార్చే నకిలీ బాబా ముందుగా రాయపుర, చార్‌బౌళి, ఎల్‌బీ నగర్‌, మచిలీబార్‌లో ఉండేవాడని బాధితులు చెప్పారు.

తాము అడ్రస్‌ తెలుసుకుని వెళ్లి డబ్బు అడగగానే అక్కడి నుంచి మరోచోటికి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లేవాడని చెప్పారు. బాబా మనుషుల నుంచి తమకు ప్రాణభయం ఉందని, తమ డబ్బు ఇప్పించాలని పోలీసుకు ఫిర్యాదు చేశామన్నారు. బాధితు ఫిర్యాదు మేరకు ఐపీసీ 354, 420 సెక్షన్‌ కింద గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా గాలిస్తున్నామని వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A fake baba has cheated a muslim family in Warangal of Telangana for about Rs 11 lakhs.
Please Wait while comments are loading...