డమ్మీ తుపాకీలతో నకిలీ నక్సలైట్లు హల్చల్: వారే టార్గెట్; ఏపీ, తెలంగాణాలలో ఆరుగురు అరెస్ట్!!
తెలుగు రాష్ట్రాలలో నకిలీ నక్సలైట్లు రెచ్చిపోతున్నారు. వ్యాపారులను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వారి తీరుతో వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రెండు వేర్వేరు ఘటనలలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నకిలీ నక్సలైట్ లను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది.
వివరాల్లోకి వెళితే నకిలీ నక్సలైట్ల పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి వ్యాపారస్తులని ఇబ్బంది పెడుతున్న ముగ్గురు నిందితులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు కు చెందిన వ్యాపారి ప్రసాద్ రాజు కు ఫోన్ చేసిన నిందితులు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ప్రసాద్ రాజు పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో పోలీసులు పక్కా ప్లాన్ తో నిందితులను పట్టుకున్నారు. ప్రసాద్ రాజు ఇంటికి డబ్బులు తీసుకు వెళ్లడానికి నిందితులను రమ్మని పిలిపించి, ఆయన ఇంటి వద్ద రెక్కీ వేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో నకిలీ నక్సలైట్లు నిన్న రాత్రి హల్చల్ చేశారు. నక్సలైట్ల మని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ములుగు జిల్లా వెంకటాపురంలో నకిలీ నక్సల్స్‌ను అరెస్ట్ చేశారు. నిందితులు నక్సల్స్‌మని చెప్పి డమ్మీ తుపాకులతో ఇసుక వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందటంతో పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు.
పట్టుకున్న ముగ్గురిని సురేష్, రాజేశ్, మంగులు గా గుర్తించారు. వారి నుంచి రెండు డమ్మీ తుపాకులు, రూ.10 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోవటంతో పోలీసులు నకిలీలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications