వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో శాలరీ ఖాతాల కుంభకోణం: ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.1.3 కోట్లు కుచ్చుటోపీ; నలుగురు అరెస్ట్!!

|
Google Oneindia TeluguNews

అసలు కంపెనీనే ఉండదు. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఉండరు. కానీ కంపెనీ ఉన్నట్టు, అందులో చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నట్టు, వారి పేర్లతో బ్యాంకులలో శాలరీ ఖాతాలు తెరిచి, అందినకాడికి రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకుని బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్న ఓ ముఠాను తాజాగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగు పలు బ్యాంకులను పెద్ద మొత్తంలోనే మోసం చేసినట్టుగా గుర్తించిన అధికారులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ శాలరీ ఖాతాల స్కామ్ .. ఐసీఐసీఐ బ్యాంక్‌ కు కుచ్చుటోపీ

నకిలీ శాలరీ ఖాతాల స్కామ్ .. ఐసీఐసీఐ బ్యాంక్‌ కు కుచ్చుటోపీ


మల్కాజిగిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో నకిలీ కంపెనీ పేరుతో జీతాల ఖాతాలు సృష్టించి నాచారంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచికి రూ.1.3 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన వారు అతి తెలివి తేటలతో వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లను తెలుసుకొని, తదనుగుణంగా పక్కా ప్లాన్ వేసి మరీ నకిలీ కంపెనీలను సృష్టించి, నకిలీ ఉద్యోగుల పేరుతో భారీ మోసాలకు తెరతీశారు.

నకిలీ కంపెనీ.. నకిలీ ఉద్యోగులు.. గ్రామాలు, తండాల వాసుల పేర్లతో శాలరీ ఖాతాలు

నకిలీ కంపెనీ.. నకిలీ ఉద్యోగులు.. గ్రామాలు, తండాల వాసుల పేర్లతో శాలరీ ఖాతాలు


సూత్రధారి బోడ శ్రీకాంత్, బాణోత్ సుమంత్, భూక్య నగేష్, గుడ్డేటి గౌతమ్, యడ్ల బిక్షపతితో కలిసి నాచారంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో లేని కంపెనీ 'లివింగ్ ఇంటీరియర్ డిజైన్' పేరుతో నకిలీ కాగితాలు సృష్టించారు. బ్యాంకు ఖాతాలు సృష్టించేందుకు వరంగల్‌కు చెందిన శ్రీకాంత్‌ తన పొరుగు గ్రామాలు, తాండాలను సంప్రదించి తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువకులు, గృహిణులకు ఆధార్‌ కార్డులు ఇప్పిస్తానని వారి అన్ని డీటెయిల్స్ తీసుకుని, ఆ తర్వాత వారి పేర్లపై జీతాల ఖాతాలు సృష్టించాడు.

శాలరీ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డులు, రుణాలు తీసుకున్న గ్యాంగ్

శాలరీ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డులు, రుణాలు తీసుకున్న గ్యాంగ్


రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. బోడ శ్రీకాంత్‌ తాను సృష్టించిన నకిలీ సంస్థ అయిన లివింగ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ సంస్థ పేరుతో 53 మందిని నకిలీ ఉద్యోగులుగా సృష్టించి, వారి జీతాలను బ్యాంకు ద్వారా జమ చేసేందుకు హబ్సిగూడ, రామంతపూర్‌, ఉప్పల్‌ శాఖల్లో ఐసీఐసీఐ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతాలు తెరిచారు. పై తెలివిగా బోడ శ్రీకాంత్ 34 మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్ల ఖాతాలలో రూ. 1 నుండి రూ. 2 లక్షల జీతాలను క్రెడిట్ చేశాడు గరిష్ట కొనుగోలు లేదా క్రెడిట్ పరిమితిని పొందడానికి మంచి క్రెడిట్ లైన్ పొందడానికి వారి ఆదాయ పరిధిని పెంచాడు.

క్రెడిట్ కార్డ్ ల ద్వారా తీసుకున్న మొత్తం చెల్లించకపోవటంతో మోసంపై బ్యాంకు ఫిర్యాదు

క్రెడిట్ కార్డ్ ల ద్వారా తీసుకున్న మొత్తం చెల్లించకపోవటంతో మోసంపై బ్యాంకు ఫిర్యాదు

క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కోసం ఐసిఐసిఐ బ్యాంక్ అందించిన సౌకర్యాలను ఉపయోగించి, శ్రీకాంత్ 34 క్రెడిట్ కార్డ్‌లపై మొత్తం రూ. 1,33,65,000 విత్‌డ్రా చేసి, కార్డు హోల్డర్‌లకు పాక్షిక మొత్తాన్ని ఇచ్చి ఆ తర్వాత తిరిగి క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకుండా ఎగ్గొట్టాడు. అంతేకాదు నిందితులంతా కలిసి మరో రెండు నకిలీ కంపెనీల పేరుతో మరికొన్ని బ్యాంకులను కూడా మోసం చేశారు. ఇక క్రెడిట్ కార్డులతో పొందిన మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టిన క్రమంలో వారికి నిరంతరం రిమైండర్‌లు మరియు నోటీసులు పంపడంతో, బ్యాంకులు సంస్థ ఉనికిలో లేదని గ్రహించి పోలీసులను ఆశ్రయించాయి. ఐదుగురు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మోసం లో సభ్యుడైన యడ్ల భిక్షపతి అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు.

మరో రెండు నకిలీ కంపెనీలతోనీ పలు బ్యాంకులకు మోసం ..నలుగురు అరెస్ట్

మరో రెండు నకిలీ కంపెనీలతోనీ పలు బ్యాంకులకు మోసం ..నలుగురు అరెస్ట్


ఇక ఈ గ్యాంగ్ నారపల్లిలోని ఎల్లో ల్యాంప్ ఇంటీరియర్ డిజైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మణికొండలోని బ్రిక్ అండ్ రాక్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడ్డారు. యస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు ఇతర బ్యాంకులను కూడా అదే విధంగా మోసం చేశారు. ఐసీఐసీఐ, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి పెద్ద బ్యాంకులను మోసం చేసిన మాస్టర్‌ మైండ్‌ బోడ శ్రీకాంత్‌.. ఆ బ్యాంకులను మోసం చేసి సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. అతని సహచరులకు కమీషన్ ఇవ్వగా, మిగతా డబ్బుతో ఒక ఇల్లు మరియు రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. పోలీసులు శ్రీకాంత్ తో పాటు, ముఠాలోని మరో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు.

English summary
fake salary accounts scam has come to light in Telangana. Rachakonda police have arrested four persons who created fake salary accounts in the name of fake companies, and done fraud Rs.1.3 crores from ICICI Bank through loans and credit cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X