అన్నీ అడిగారు, కానీ..: ఇవాంక ఫలక్‌నుమా విందుపై నిజాం మనవడు
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ఫలక్‌నుమా విందు వ్యవహారంపై నిజాం పాలకులలో చివరివాడైన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనువడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
తన వారసత్వ సంపద అయిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇవాంకాతోపాటు ఇతర ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందుకు తనను ఆహ్వానించకపోవడంపై ఆయన నిరాశ చెందారు. ఫలక్‌నుమా ప్యాలెస్ హైదరాబాద్‌తోపాటు తమ కుటుంబ సంస్కృతికి గుర్తింపు సూచకమని ఆయన అన్నారు.

అలాంటి ప్రదేశంలో...
అలాంటి ప్రదేశంలో జరిగిన విందుకు తనను ఆహ్వానించకపోవడం ఏమిటని నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఈ విందులో పలువురు వ్యాపారవేత్తలు, ప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు. తమ సంస్కృతి, సంప్రదాయంలో జరిగినా తమను మాత్రం ఆహ్వానించలేదని చెప్పారు.

అన్నీ అడిగారు, కానీ...
ఫలక్‌నుమాలో విందు నిర్వాహణ కోసం నీతి ఆయోగ్ అధికారులు గత పది రోజులుగా తనను సంప్రదించారని, ఇవాంకా కోసం నిజాం గది కూడా బుక్ చేశారని, కానీ విందుకు తనను ఆహ్వానించలేదని నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ అన్నారు.

అ తరహాలో ఆహ్వానం...
నిజాం పాలకుల విధానంలో ఇవాంకాకు స్వాగతం పలికారని, విందు కోసం ఆహార పదార్థాలను కూడా అదే రీతిలో తయారు చేశారని, కానీ తమ కుటుంబాన్ని ఆహ్వానించలేదని న అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిజాం
నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని పాలించాడు. తాజ్ గ్రూప్ పునరుద్ధరించిన తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్‌ను స్టార్ హోటల్‌గా మార్చారు. హైదరాబాద్ చరిత్రలో దానికి అత్యంత ప్రధానమైన చోటు ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications