ఫలక్ నుమా ఫైర్ వెనుక - మంటల్లో ప్రయాణీకుల బోగీలు, ఏం జరిగింది..!!
వేగంగా ప్రయాణిస్తున్న రైల్లో ఒక్క సారిగా మంటలు చెలగేరాయి. ప్రయాణీకులు హాహాకారాలు చేసారు. చైన్ లాగటంతో ప్రయాణీకులంతా కిందకు దిగేసారు. ఏకంగా మూడు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. పూర్తిగా దహనమయ్యాయి. మరో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పగలు సమయం కావటంతో ప్రమాదం గుర్తించారు. అసలు ఇంత భారీ ప్రమాదానికి కారణమేంటి. రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు.
త్రుటిలో తప్పిన ఘోరం : హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. మరో అరగంటలో సికింద్రాబాద్ చేరుకోవాల్సిన సమయంలో ఒక్క సారిగా బొమ్మాయపల్లి - పగిడిపల్లి మధ్య రైలులో మంటలు చెలరేగాయి. ఒక్క సారిగా పొగ అలముకుంది. దీంతో ప్రయాణీకులు ఏం జరుగుతుందో అర్దం కాలేదు. వెంటనే చైన్ లాగి రైలును ఆపటంతో వెంటనే అందరూ కిందకు దిగేసారు.

ఉదయం సమయం కావటంతో ప్రయాణీకులు జరుగుతున్న ప్రమాదాన్ని వెంటనే పసి గట్టారు. కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. రైలులోని ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 కోచ్ లు పూర్తి మంటల్లో కాలిపోయాయి. ఇతర బోగలకు వ్యాపించకుండా మధ్యన ఉండే లింకు తొలిగించారు. ప్రత్యక్షంగా ఈ ఘటన చూసిన ప్రయాణీకులు భీతావాహులయ్యారు.
అధికారుల నిర్లక్ష్యం : ఉదయం 10.20 నిమిషాలకు చిట్యాల దాటి సికింద్రాబాద్ వైపు వస్తున్న సమయంలో ఒక్క సారిగా ఎస్ 3 లో మంటలు చెలరేగాయి. ఈ రైలులో సికింద్రాబాద్ కు నిత్యం రాకపోకలు సాగించే వారు రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేస్తారు. వీరిని టీసీలు కూడా పట్టించుకోరు. ఇప్పుడు దహనం అయిన మూడు బోగీలు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎక్కవ సంఖ్యలో రిజర్వ్ చేస్తున్న ప్రయాణీకులు ఉంటారు.
ఒక వ్యక్తి కోచ్ లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వద్ద సిగరెట్ తాగుండటంతో రైలు వేగానికి ఆ నిప్పులు పక్కనే ఛార్జింగ్ బోర్డు పైన పడి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయని ప్రయాణీకులు చెబుతున్నారు. ప్రయాణీకులే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ రైలు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. రోడ్డు ద్వారా ఆ ప్రాంతానికి ఫైరింజన్లు వెంటనే చేరుకొనే అవకాశం లేదు.
భువనగిరి మండలం బోమ్మాయిపల్లి - పగిడిపల్లి మధ్యలో
— oneindiatelugu (@oneindiatelugu) July 7, 2023
ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ రైలు లో పొగలు..!!#falaknumaexpress #indianrailways #railways #oneindiatelugu
Do follow us https://t.co/3jdVlSC6ve pic.twitter.com/IxfOoK3Z4x
పలు రైళ్ల ఆలస్యం : ఉదయం సమయం కావటంతో ప్రయాణీకులు అప్రమత్తం అయ్యారు. ఇటువంటి ప్రమాదాలు రాత్రి వేళ జరిగి ఉంటే పరిస్థితి ఘోరంగా ఉండేదని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ఒడిశా లో జరిగిన రైలు ప్రమాద ఘటనను ఇంకా ఎవరూ మర్చి పోలేదు. రైళ్లలో నిరంతరం గస్తీ ఉంటుంది.
ఫలక్ నుమా వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లల్లో రిజర్వేషన్ బోగీల్లో టికెట్ లేని ప్రయాణీకులకు అనుమతి ఉండదు, కానీ టికెట్ లేని వారు సైతం రిజర్వేషన్ కోచ్ ల్లో ప్రయాణం చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ప్రమాదానికి కారణాల పైన రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రయాణీకులు అందరు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లిడించారు. అగ్ని ప్రమాదంలో కోచ్ లు దహనం కావటంతో ఈ మార్గంలో సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications