Mancherial: స్టాక్ మార్కెట్ లో నష్టం రావడంతో ఆత్మహత్యా యత్నం చేసిన కుటుంబం..
ఈ మధ్య స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా టైమ్ నుంచి డీ మ్యాట్ ఖాతాలు భారీగా ఓపెన్ చేస్తున్నారు. భారీ లాభాలు వస్తాయని చాలా మంది ఎలాంటి అవగాహన లేకుండా పెట్టుబడి పెడుతున్నారు. ఇలా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఇన్ ట్రా డే, ఆప్షన్స్ ట్రేడింగ్ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. సోషల్ మీడియాలో టిప్స్ తీసుకుని పెట్టుబడి పడుతున్నారు.
కొంత మంది అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో వారి కుటుంబం ఆత్మహత్యా యత్నం చేసింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామనికి చెందిన శివప్రసాద్ యువకుడు సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్ పై యాడ్స్ చూశాడు. స్టాక్ మార్కెట్ లో భారీగా లాభాలు వస్తాయని అపోహతో భారీగా పెట్టుబడి పెట్టిన లాస్ అయ్యాడు. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. అయితే ఎక్కడ ఉద్యోగం లభించకపోవడంతో ఇంటికి వెళ్లాడు.

ఇంటి వద్ద కిరాణ షాపు నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అప్పులు చేసి మళ్లీ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు. అయితే మళ్లీ నష్టపోయినట్లు తెలిసింది. అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో ఏం చేయాలో అర్థం కానీ ఆ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. తండ్రి మొండయ్య, తల్లి శ్రీదేవి, చెల్లి చిట్టితో కలిసి శివప్రసాద్ పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో శివప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది.
సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసి పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని అన్నారు. గతంలో కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారు చాలా మందే ఉన్నారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications