లైంగిక వేధింపుల వివాదం: మసాజ్ చేయించుకొన్నా, కానీ, నా బిడ్డగా భావించా: గజల్ శ్రీనివాస్

Posted By:
Subscribe to Oneindia Telugu
  యువతిపై లైంగిక వేధింపులు.. గజల్ శ్రీనివాస్ అరెస్ట్..

  హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.ఓ రేడియో జాకీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే ఈ ఆరోపణలను గజల్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. తనపై రేడియో జాకీ తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆయన ఆరోపించారు.

  ప్రముఖ నాయకుడు గజల్ శ్రీనివాస్ ఆలయవాణి అనే వెబ్ రేడియో నిర్వహిస్తున్నాడు. ఈ వెబ్ రేడియో లో అధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తారు.అయితే ఈ వెబ్ రేడియో పనిచేసే ఓ రేడియో జాకీ గజల్ శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  గజల్ శ్రీనివాస్ తనను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశారని భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు గజల్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.గజల్ శ్రీనివాస్‌పై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

  9 మాసాలుగా లైంగిక వేధింపులుత

  9 మాసాలుగా లైంగిక వేధింపులుత

  గజల్ శ్రీనివాస్ 9 మాసాలుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉద్దేశ్యపూర్వకంగానే తనను గజల్ శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నాడని రేడియో జాకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది మానసికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు లైంగిక వేధింపులకు కూడ గజల్ శ్రీనివాస్ పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపణలు చేశారు.

  నా బిడ్డగా భావించాను

  నా బిడ్డగా భావించాను


  తనపై లైంగిక ఆరోపణలు చేసిన రేడియో జాకీని తాను బిడ్డగా భావించానని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ చెప్పారు. తన మనస్సాక్షి ప్రకారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు ఆయన మీడియాకు చెప్పారు. తనపై బాధితురాలు తప్పుడు ఫిర్యాదులు చేసిందని ఆయన వివరణ ఇచ్చారు. రేడియో జాకీ తనపై చేసిన ఆరోపణలను గజల్ శ్రీనివాస్ తోసిపుచ్చారు.

  మసాజ్ చేసింది వాస్తవమే

  మసాజ్ చేసింది వాస్తవమే

  తనకు ఇటీవలే యాక్సిడెంట్ అయిందని గజల్ శ్రీనివాస్ చెప్పారు. అయితే యాక్సిడెంట్ కారణంగా ప్రతి రోజూ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఒకరోజు ఫిజియోథెరపిస్టు రాకపోవడంతో తనపై ఫిర్యాదు చేసిన మహిళే పట్టుబట్టి తనకు మసాజ్ చేసిందని ఆయన చెప్పారు. తనకు ఫిజియోథెరఫీ చేయడం వచ్చని చెప్పి మసాజ్ చేసిందని గజల్ శ్రీనివాస్ చెప్పారు.

  సీసీటీవి పుటేజీ దొంగిలించారు

  సీసీటీవి పుటేజీ దొంగిలించారు

  మహిళలంటే తనకు అమితమైన గౌరవమని గజల్ శ్రీనివాస్ చెప్పారు. రేడియో జాకీని వేధించానని రేడియో జాకీ చేసిన ఫిర్యాదు అవాస్తవమని చెప్పారు.తన కార్యాలయంలోని సీసీటీవి పుటేజీని దొంగిలించిందని బాధితురాలిపై గజల్ శ్రీనివాస్ ప్రత్యారోపణ చేశారు.

  మసాజ్ చేసినప్పుడు నేను కూడ ఉన్నా

  మసాజ్ చేసినప్పుడు నేను కూడ ఉన్నా

  గాయకుడు గజల్ శ్రీనివాస్ పై రేడియో జాకీ ఫిర్యాదుపై అదే సంస్థలో పనిచేస్తున్న మరో రేడియో జాకీ ఖండించారు. గజల్ శ్రీనివాస్ భుజానికి రేడియో జాకీ మసాజ్ చేసిన మాట వాస్తవమేనని ఆమె చెప్పారు. ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. గజల్ శ్రీనివాస్ అలాంటి వ్యక్తి కాదని ఆమె అభిప్రాయపడ్డారు.గజల్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేసిన రేడియో జాకీ రోజుకో రకంగా ప్రవర్తిస్తోందని ఆమె చెప్పారు.

   వీడియో పుటేజీ ఆధారంగా అరెస్టు చేశారు

  వీడియో పుటేజీ ఆధారంగా అరెస్టు చేశారు

  అన్ని రకాల సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్టు పంజాగుట్ట ఎసీపీ విజయ్ కుమార్ చెప్పారు. గత ఏడాది నుండి రేడియో జాకీని వేధిస్తున్నాడని ఆయన చెప్పారు. రెండు మాసాల నుండి ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయని ఆయన చెప్పారు. ఆఫీసులోని రెస్ట్ రూమ్‌లోకి బాధితురాలని పిలిపించుకొని అసభ్యంగా వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు. అయితే ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో మహిళ కూడ రేడియో జాకీని గజల్ శ్రీనివాస్ కు లొంగాలని ఒత్తిడి తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఆమెతో కూడ గజల్ శ్రీనివాస్ కు వివాహేతర సంబంధం ఉన్న ఆధారాలను తమకు చూపించారని చెప్పారు.

   పక్కా ఆధారాల సేకరణ

  పక్కా ఆధారాల సేకరణ

  లైంగిక వేధింపులకు గురిచేస్తున్న కారణంగా ఉద్యోగం మానేయాలని బాధితురాలు ప్రయత్నాలు చేస్తే ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ తో పాటు ఇతర సర్టిపికెట్లు ఇవ్వబోనని గజల్ శ్రీనివాస్ రేడియో జాకీని వేధించాడని పోలీసులు తెలిపారు. అయితే గజల్ శ్రీనివాస్ వేధింపులకు సంబంధించిన సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించిన తర్వాతే భాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని ఎసీపీ విజయ్ కుమార్ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Famous singer Ghazal Srinivas arrested for sexual harassment on Tuesday. A Radio jockey complained against Gajal srinivas.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి