బస్ పాస్‌కు డబ్బుల్లేక రైతు కూతురు ఆత్మహత్య

ముంబై: మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా జధాలా గ్రామాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లేందుకు బస్సు పాసు తీసుకోడానికి డబ్బులు లేక.. కరవు పరిస్థితుల వల్ల పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన తండ్రి దుస్థితి చూడలేక.. ఓ రైతు కుమార్తె అయిన ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. జధాలా గ్రామానికి చెందిన స్వాతి విట్టల్‌ పిటాలె(16) అక్టోబరు 14న ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన జరిగిన సమయంలో తండ్రి పని కోసమని పొరుగునున్న కర్ణాటక వెళ్లారు.

కాగా, బస్సు పాసు గడువు పూర్తికావడంతో దాన్ని పునరుద్దరించేందుకు స్వాతికి రూ.260 అవసరమయ్యాయి. డబ్బులు లేక ఆమె కొన్నిరోజులు కళాశాలకు వెళ్లలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత స్వాతి తల్లి ఇంకొకరిని అడిగి ఆ డబ్బు సర్దారు.

 Farmer’s daughter ends life for want of money to buy bus pass

స్వాతి కళాశాలకైతే వెళ్లింది కానీ అప్పటికే చాలా తరగతులు అయిపోవడంతో ఆమె మనస్తాపానికి లోనైంది. ఇంటికి వచ్చాక వాళ్ల పొలానికి వెళ్లి అక్కడ దొరికిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, తన తండ్రి ఎంతో నిజాయతీపరుడని, డబ్బులు అడగవద్దని, తన సోదరి వివాహం అయ్యాక ఆయన సర్దుబాటు చేస్తారని బ్యాంకు అధికారులను, అప్పుల వాళ్లను సూసైడ్‌ నోట్‌ ద్వారా కోరింది. తన వివాహం తండ్రికి భారం కాకూడదనే ఈ పని చేశానని నోట్‌లో రాసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+