రైతుల ఆందోళన విరమణ: రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపు

కామారెడ్డి: రైతులు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలను విరమించారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 8గంటలకుపైగా కామారెడ్డి కలెక్టరేట్ వద్ద 8 గంటలుగా కొనసాగించిన ఆందోళనను రైతులు తాత్కాలికంగా విరమించినట్లు చెప్పారు. గురువారం ఉదయం నుంచి ధర్నా చేసిన రైతులు కలెక్టరేట్ వద్ద దిష్టిబొమ్మలుకు వినపత్రం ఇచ్చి గేటుకు తాళం వేశారు.

అంతేగాక, శుక్రవారం కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు రైతు నేతలు. రేపట్నుంచి భవిష్యత్ కార్యాచరణ మొదలవుతుందని రైతు జేఏసీ నేతలు చెప్పారు. వేలాది మంది రైతులు వచ్చి.. కలెక్టర్ వచ్చి వినతిపత్రం తీసుకోవాలని కోరినా.. ఆయన బయటకు రాలేదని రైతు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

farmers stopped protest at kamareddy collector: calls for bandh tomorrow

కలెక్టరేట్ వద్ద వంటావార్పు చేసి.. రైతులు అక్కడే భోజనం చేశారు. కాగా, రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వారితో కలిసి నిరసన తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ రావట్లేదన్నారు. కలెక్టర్ రైతులతో మాట్లాడేందుకు సమస్యేంటి? అని ప్రశ్నించారు. ఎస్పీ వచ్చి మాట్లాడారుగా.. కలెక్టర్ వచ్చి రైతులతో మాట్లాడేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

farmers stopped protest at kamareddy collector: calls for bandh tomorrow

మరోవైపు, రైతులతో మాట్లాడేందుకు తాను సిద్ధమేనని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ తెలిపారు. రైతు ప్రతినిధులు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన దగ్గరకు వచ్చిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. రైతుల తరపున 10 మంది వచ్చి వినతి పత్రం ఇవ్వవచ్చని, రైతుల అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఇండిస్ట్రియల్ మాస్టర్ ప్లాన్ ఇంకా ముసాయిదా దశలోనే ఉందని.. మాస్టర్ ప్లాన్ పై రైతుల్లో కొందరు లేనిపోని భయాలు సృష్టించారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+