వార్డు కార్యాలయాల ద్వారా వేగంగా పౌర సేవలు.!నగర పాలక అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం.!
హైదరాబాద్ : ఒకే రోజు నగరవ్యాప్తంగా 150 డివిజన్ లలో వార్డ్ కార్యాలయాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయన్నారు. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుందని, వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు కానీ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వలన ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు మంత్రి కేటీఆర్.
రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ : నగర పౌరులకు సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ విజయవంతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. స్ధానిక ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా వార్డు కార్యాలయానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశం మొత్తం ఈ వ్యవస్థను అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశం ఉందనే ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేసారు.















Click it and Unblock the Notifications