విషాదం: రైలు ఢీకొని తండ్రీ, ఇద్దరు కూతుళ్లు మృతి
మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో తండ్రి, ఇద్దరు కుమార్తెలను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుడిని మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన కృష్ణగా గుర్తించారు.
కృష్ణ.. గౌడవెల్లిలో రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌చెకింగ్‌గా పని చేస్తాడని స్థానికులు తెలిపారు. ఆదివారం కావడంతో తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని విధులకు వచ్చాడు. కృష్ణ పనిచేస్తుండగా ఇద్దరు కుమార్తెలు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్నారు. అదే సమయంలో, రైలు అటుగా రావడం గమనించిన కృష్ణ ఇద్దరు కుమార్తెలను కాపాడబోయి రైలు ఢీకొని మృతి చెందారు. కృష్ణతోపాటు ఇద్దరు కుమార్తెలు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మృతి చెందిన ఇద్దరు పిల్లలను వర్షిత ,వర్షిణిగా స్థానికులు తెలిపారు. కాగా, ఘటన విషయంతో తెలియడంతో చిన్నారుల తల్లి అక్కడికి చేరుకుని భోరున విలపించారు. ఒక్కసారిగా కుటుంబ పెద్దతోపాటు ఇద్దరు కుమార్తెలు మరణించడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు, ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వాగులో కొట్టుకుపోయిన కారు: ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
ఓ వాగు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అందులోని ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మెహత్పూర్ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్‌లోని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
జైజోన్ ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో డ్రైవర్ తోపాటు మొత్తం 10 మంది కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొది. ఒకరిని కాపాడిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు మృతదేహాను గుర్తించామని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ జాగిర్ సింగ్ తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications