దారుణం: కూతుళ్లతో వ్యభిచారం చేయిస్తున్న పెంపుడు తండ్రి
హైదరాబాద్: దత్తత తీసుకున్న కుమార్తెలతో వ్యభిచారం చేయిస్తున్న పెంపుడు తండ్రిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులే స్వయంగా వ్వభిచారం ఊబిలోకి దించడంతో వారి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లో నివాసం ఉంటున్న పద్మ, రమేష్‌కు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు చిన్నప్పుడు తండ్రి రమేష్ గుండెపోటుతో చనిపోయాడు. ఆ తర్వాత తల్లి పద్మ కల్లుకు బానిసై గోవిందు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె మతిస్థిమితం లేని పరిస్థితులకు చేరడంతో కుమార్తెల్ను గోవిందు, అతడి భార్య లక్ష్మీ పెంచుకుంటున్నారు. పిల్లలిద్దరికీ యుక్త వయస్సు వచ్చిన తర్వాత వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారు. వారిచే వ్యభిచారం చేయిస్తూ... డబ్బు వసూలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పెంపుడు తల్లిదండ్రుల వేధింపులు తట్టుకోలేక పెద్ద కుమార్తె వారం రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. గోవిందు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
రెండు రోజులు క్రితం ఆ యువతిని కనిపెట్టిన పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి ఎందురు పారిపోయావంటూ పోలీసులు ప్రశ్నించగా పెంపుడు తల్లిదండ్రులు మాతో వ్యభిచారం చేయిస్తున్నారంటూ చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పెంపుడు తండ్రిని అరెస్ట్ చేసి తల్లి లక్ష్మిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications