కన్నతండ్రే: ఆరో తరగతి కుమార్తెపై అత్యాచారం.., కబేళా నుంచి వచ్చి ఇలా!
జియాగూడ: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురినే కాటేశాడు. కడుపున పుట్టిన బిడ్డ అన్న కనీస మానవత్వం లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని జియాగూడ పరిధిలో ఉన్న కల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
సులేమాన్‌జా మక్బరా ప్రాంతానికి చెందిన హేరేకర్ గణేష్ (30) అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుమార్తెపై భర్త అత్యాచారం చేశాడన్న సంగతి తెలిసి ఆమె పోలీసులను ఆశ్రయంచడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదీ నేపథ్యం
రాధిక దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గణేష్ జియాగూడ మేకలమండిలో కబేళా కార్మికుడిగా పని చేస్తుండగా ఆయన భార్య రాధిక కార్వాన్ భాంజావాడిలోని శిశుమందిర్ పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది.
రాధిక పనిచేసే స్కూల్లోనే పిల్లలు కూడా చదువుతున్నారు. పెద్ద కుమార్తె ఆరో తరగతి, చిన్న కుమార్తె ఐదో తరగతి, కుమారుడు రెండో తరగతి చదువుతున్నాడు. గణేశ్ ప్రతీరోజు తెల్లవారుజామున 4గం.కు జియాగూడ కబేళాకు పనికి వెళ్లి తిరిగి ఉదయం 9గం. ప్రాంతంలో ఇంటికి వస్తుంటాడు.

కుమార్తెపై అత్యాచారం:
రాధిక ఉదయం 9గం.కు స్కూలుకు వెళ్లి సాయంత్రం సమయంలో తిరిగొచ్చేది. ఇదే క్రమంలో ఈ నెల 24న ఉదయం 9 గంటలకు కబేళా నుండి ఇంటికి వచ్చిన గణేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్న పెద్ద కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఇలా తెలిసింది
ఇటీవల కుమార్తె ముభావంగా ఉండటంతో గమనించిన తల్లి.. విషయం ఆరా తీసింది. కుమార్తె అనారోగ్యానికి గురవడం కూడా ఆమెకు అనుమానం కలిగించింది. తల్లి అడగడంతో.. బోరున ఏడ్చిన కుమార్తె అసలు విషయం చెప్పింది. వెంటనే స్థానిక కల్సుంపురా పోలీస్ స్టేషన్ లో కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్లి ఫిర్యాదు చేసింది.

నిందితుడి అరెస్ట్:
రాధిక ఫిర్యాదు మేరకు నిందితుడు హేరేకర్ గణేష్‌ని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications