దండం పెట్టాల్సిన అవసరం లేదు: ఈటెల, రేస్ కోర్స్‌లో సందడి (పిక్చర్స్)

హైదరాబాద్/వరంగల్: నిన్నటి తెలంగాణ ఉద్యమ ద్రోహులే నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం అన్నారు.

హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో దీపం పథకాన్ని ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కడియం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడారు.

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. జిల్లాలో అవసరమున్న మేరకు గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోనే వంద శాతం గ్యాస్ కనెక్షన్లున్న జిల్లాగా వరంగల్ మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.

జిల్లాలో గుడుంబా తయారీ, అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని, ఒకవేళ విక్రయాలు జరిగితే ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. పేదలందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తున్నామన్నారు.

 రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు హైదరాబాదు.. మలక్‌పేటలోని రేస్ కోర్సులో సందడి చేశారు.

రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు హైదరాబాదు.. మలక్‌పేటలోని రేస్ కోర్సులో సందడి చేశారు. రేస్ కోర్సులో గుర్రంపై ఒకరి ప్రదర్శన

రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు హైదరాబాదు.. మలక్‌పేటలోని రేస్ కోర్సులో సందడి చేశారు. హైదరాబాద్ మాన్సూన్ రేస్ 2015 గోల్డ్ కప్.

 రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు హైదరాబాదు.. మలక్‌పేటలోని రేస్ కోర్సులో సందడి చేశారు. హైదరాబాద్ మాన్సూన్ రేస్ 2015 గోల్డ్ కప్‌తో మంత్రి ఈటెల, తదితరులు.

 రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

రేస్ కోర్సులో ఈటెల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు హైదరాబాదు.. మలక్‌పేటలోని రేస్ కోర్సులో సందడి చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, మహిళలకు సంపూర్ణమైన పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు పచ్చని తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

దీపం పథకంలో రాష్ట్రంలో 20 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం రూ.300 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ప్రతి పేద మహిళకు గ్యాస్ కనెక్షన్‌ను రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు, దండం పెట్టాల్సిన అవసరం లేకుండా రాజకీయాలకు అతీతంగా దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. కాగా ఈటెల రాజేందర్ హైదరాబాదులోని మలక్‌పేటలోని రేస్ కోర్సులో సందడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+