సికిందరాబాద్ రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం .. పలు ఫైళ్ళు దగ్ధం
సికింద్రాబాద్ రైల్ నిలయంలోని 7 వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది . శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పలు ఫైళ్ళు దగ్ధం అయ్యాయి . షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధం కాగా కంప్యూటర్, టెలి కమ్యూనికేషన్ కు సంబంధించిన డ్రాయింగ్స్ కాలిపోయినట్లు తెలిపారు. పొగలు వచ్చిన వెంటనే సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఉదయం 6 గంటల సమయంలో 7 వ అంతస్తులోంచి పొగలు రావడం తో స్థానికులు సమాచారం ఇచ్చారని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.

2017 లో కూడా రైల్ నిలయంలోని ఏడో అంతస్తులోనే అగ్ని ప్రమాదం జరిగింది .అప్పుడు కూడా రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి మంటలను అదుపు చేశారు. ఏడో అంతస్తుపైన శ్లాబ్‌కు తారు తో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలో గ్యాస్ సిలిండర్‌కు మంటలు వ్యాపించాయి. సకాలంలో సిబ్బంది స్పందించడంతో అప్పుడు సైతం పెను ప్రమాదం తప్పినట్లయింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications