యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
తెలంగాణ రాష్ట్రంలోని బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. అయితే, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.

నార్సింగ్ పీఎస్ పరిధిలో జంట హత్యల కలకలం
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని పోలీసులు గుర్తించారు. యువకుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించిన పోలీసులు.. అతడు నానక్‌రామ్‌గూడలో ఉంటూ హౌస్ కీపింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
మృతురాలును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బిందు(25)గా గుర్తించారు. ఆమె ఎల్బీనగర్‌లో నివాసం ఉంటోంది. మృతులిద్దరికీ ఇప్పటికే పరిచయం ఉందని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులు తేల్చారు సాకేత్ జనవరి 8న బిందుని తీసుకొచ్చి నానక్‌రామ్‌గూడలోని తన స్నేహితుడి వద్ద ఉంచాడని.. 11న రాత్రి వీరి హత్య జరిగి ఉటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications