తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు: రెండు బోగీలు దగ్ధం, ప్రయాణికులు సేఫ్

Recommended Video

    తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు: రెండు బోగీలు దగ్ధం, ప్రయాణికులు సేఫ్

    న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్‌గఢ్ వద్ద నేటి ఉదయం 7.45గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఓ బోగి పూర్తిగా కాలిపోయింది.

    వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఘటన కారణంగా అదే మార్గంలో నడిచే మిగిలిన రైళ్లు ఆగిపోయాయి.

    Fire Breaks Out In Hyderabad-Delhi Telangana Express, Passengers Safe

    ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ముందుగా బీ1 బోగీలో చెలరేగిన మంటలు ప్యాంట్రీ.. ఆ తర్వాత ఎస్-10 బోగీకి వ్యాపించినట్లు తెలుస్తోంది.

    బ్రేక్ బైండింగ్ గట్టిగా పట్టి వేయడంతో పొగలు వ్యాపించాయని ఉత్తర రైల్వే సీపీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
    ప్రయాణికులకు ఎలాంటి హాని కలకగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+