హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ వద్ద పేలుడు, తగలబడిన వాహనాలు

హైదరాబాద్ నగరంలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ వద్ద మంగళవారం రాత్రి కలకలం రేగింది. బస్‌స్టేషన్‌ పార్కింగ్‌ ప్రాంతంలో హఠాత్తుగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(సీబీఎస్‌, ఇమ్లీబన్‌ స్టేషన్‌) వద్ద మంగళవారం రాత్రి కలకలం రేగింది. బస్‌స్టేషన్‌ పార్కింగ్‌ ప్రాంతంలో హఠాత్తుగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.

పార్కింగ్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న 220/132 కేవీ సబ్ స్టేషన్ లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిప్పు అంటుకోవడంతో ఆ ప్రాంతంలో నిలిపి ఉన్న పలు వాహనాలు తగలబడ్డాయి.

fire-mgbs

ఎంజీబీఎస్‌.. నిత్యం లక్షల్లో ప్రయాణికులు వచ్చిపోయే ప్రదేశం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడు ఘటనలో పౌరులెవరైనా గాయపడిందీ, లేనిదీ తెలియాల్సిఉంది.

English summary
Fire broke out in parking area of Mahatma Gandhi Bus Station of Hyderabad here on Tuesday night. According to the reports, there is a transformer near the parking area. All of sudden blasting occured and fire spread in the adjoining vehicles which are parked in the parking area. By the time, 4 fire engines reached and at present the fire men trying to seize the fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X