ఏటీఎం వద్ద ఫైర్, యువతి నగల చోరీ: పురోగతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పట్టపగలే కాల్పుల కలకలం చెలరేగింది. యూసుఫ్‌గూడలోని ఎస్సార్ నగర్ ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని దుండుగుడు యువతిని తుపాకీతో బెదిరించి నగదు, నగలను అపహరించుకు వెళ్లాడు.
బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు డబ్బులు డ్రా చేసేందుకు యువతి ఏటీఎం వద్దకు వచ్చింది. ఆమెను దుండగుడు తుపాకీతో బెదిరించి చోరీ చేశాడు. ఆమె వద్దనున్న నగలు, డబ్బులు దోచుకున్నాడు. దుండుగుడు తుపాకీతో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు.

నిందితుడి చిత్రాన్ని ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ఆరంభించారు. ప్రస్తుతం బాధిత యువతి షాక్‌లో ఉన్నారు.
మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేష్ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యువతి పేరు శ్రీలతగా తెలుస్తోంది. ఆమె మధురానగర్ లోని ఓ హాస్టల్లో ఉంటోంది. ఆమె నుండి చైన్, ఉంగరం, ఏటీఎం కార్డ్ లాక్కున్నాడు. కాగా, మహారాష్ట్ర, బీహార్ గ్యాంగుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన ఎస్పీఐ ఏటీఎం సారథి స్టూడియో సమీపంలో ఉంది.నగరంలోని యూసుఫ్‌గూడలో ఏటీఎం వద్ద యువతిపై దాడి చేసి కలకలం సృష్టించిన దుండగుడి ఫోటోలు పోలీసులకు చిక్కాయి. హైదరాబాద్‌లో కలకలం రేపిన ఏటీఎం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా ఫోటోలను పోలీసులు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్ పోలీసులు రంగంలోకి దిగారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
దుండగుడు ఏటీఎం నుంచి ప్రక్కన ఉన్న ఉడిపి హోటల్ వైళ్లినట్లుగా తెలియవచ్చింది. పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టారు. ఉడిపి హోటల్‌లో ఉన్న సీసీ కెమెరాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రహదారిలో ఉన్న సీసీ కెమెరాలన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. యువతి దగ్గర దొంగిలించిన ఏటీఎమ్ కార్డుతో దుండగుడు మరో ఏటీఎం నుంచి రూ.2500 డ్రా చేశాడు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications