తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంక్: ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు, ఐదేళ్లపాటు నిల్వకు అవకాశం
హైదరాబాద్: తెలుగు రాస్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటైన ఈ తొలి స్కిన్ బ్యాంక్‌ను సోమవారం హోంమంత్రి మహమూద్ అలీ, హెటిరో ఛైర్మన్ డాక్టర్ బీపీఎస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
రూ. 60 లక్షల వ్యయంతో హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సహకారంతో ఆస్పత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఈ స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. శరీరం ఏదైనా ప్రమాదం కాలితే.. ప్రోటీన్లు, ఫ్లూయిడ్స్ ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది. అలాంటి గాయాలకు డ్రెస్సింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చికిత్స చేయకపోతే మరింత బాధ ఉంటుంది.

ఇలాంటి బాధితుల కోసం అత్యాధునిక పద్ధతుల్లో చికిత్స అందించేందుకు చారిత్రాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సిద్ధమవుతోంది. అలాంటి వారి కోసమే స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్ వెల్లడించారు. 40 శాతానికిపైగా కాలిన గాయాలకు స్కిన్ బ్యాంక్ చికిత్స చేస్తామని తెలిపారు.
ప్లాస్టిక్ సర్జరీ ద్వారా స్కిన్ అతికించవచ్చని, అందవిహీనంగా తయారైన చర్మాన్ని సర్జరీ చేసి సాధారణ స్థితిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కేవలం హెపటైటీస్, హెచ్ఐవీ టెస్టులు చేసి స్కిన్ తీసుకుంటారు. ఐదేళ్ల వరకూ చర్మాన్ని ఈ బ్యాంకులో స్టోర్ చేయవచ్చని నాగేందర్ వివరించారు.












Click it and Unblock the Notifications