తెలంగాణా రెవెన్యూ ప్రక్షాళనలో తొలి అడుగు .. జాయింట్ కలెక్టర్ పోస్టులు రద్దు అందుకే !!
Recommended Video
తెలంగాణా రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా మార్చాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖప్రక్షాళనకు సంబంధించిన తొలి అడుగు పడింది. జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేస్తూ తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది .

రాష్ట్రంలో పాలనా సంస్కరణలపై సీఎం దృష్టి
తెలంగాణా సీఎం కేసీఆర్ తాను అనుకున్నదే చేస్తున్నారు . సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రెవెన్యూ శాఖ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది . రెవెన్యూ శాఖలో అవినీతి విషయంలో స్పందించిన కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాలనా సంస్కరణల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో రెవెన్యూ చట్టం అమలు, భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టును రద్దు చేసింది.

జాయింట్ కలెక్టర్ పోస్తులు రద్దు .. అదనపు కలెక్టర్ల నియామకం
రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించటమే కాకుండా చాలా జిల్లాల జాయింట్ కలెక్టర్లను అదే జిల్లాకు అదనపు కలెక్టర్లుగా బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త అధికారులను అదనపు కలెక్టర్లుగా, అలాగే 14 జిల్లాలకు వేరే అధికారులను (స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లు గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 49 మంది నాన్‌కేడర్, కేడర్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చెయ్యటం సీఎం కేసీఆర్ పరిపాలనపై దృష్టి సారించారనటానికి నిదర్శనం . ఆదివారం అర్ధరాత్రి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన
అవినీతికి ఆస్కారం లేకుండా వుండే విధంగా , ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేసి అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పోస్టులను సృష్టించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీసును నెలకొల్పి రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు శ్రీకారం
దీనికి తోడురెవెన్యూ శాఖలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావటానికి చాలా సీరియస్ గా పని చేస్తున్నారు సీఎం కేసీఆర్ . గతంలో రెవెన్యూ శాఖను సంబంధిత శాఖల్లో విలీనం చేస్తామని ప్రకటించారు. ఇక సీఎం ప్రకటన చేసిన నాటి నుండి దీని కోసం కసరత్తు సాగుతూనే ఉంది . కొత్త రెవెన్యూ చట్టంపై ప్రభుత్వ కసరత్తులో భాగంగా ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయటం ఈ కమిటీ పలు ప్రతిపాదనలపై అధ్యయనం చెయ్యటం జరిగింది.

రెవెన్యూ ప్రక్షాలనలో భాగంగానే జేసీ పోస్ట్ రద్దు చేసిన సర్కార్
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఈ కమిటీ రెవెన్యూశాఖకు సంబంధించి కీలక సిఫార్సులు చేసింది . కొత్త రెవెన్యూ చట్టం కూడా సిద్ధం అయ్యింది . రెవెన్యూశాఖకు సంబంధించిన పలు విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం . కొత్త రెవెన్యూ చట్టం అమలుకు రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో తొలి అడుగు పడింది. జిల్లా స్థాయిలో రెవెన్యూ చట్టం అమలు, భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేసి తెలంగాణా సర్కార్ హింట్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications