తొలి లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్ప్: కవిత ట్వీట్

హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ రంగంలోకి కూడా మహిళలు అడుగు పెట్టారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను కేటాయించారు. వీరంతా టీసీఎస్ జంక్షన్, సైబర్ టవర్స్ జంక్షన్, 100 ఫీట్ రోడ్డు జంక్షన్‌ల్లో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రధానంగా ఫ్రీ లెఫ్ట్ నిర్వహణ, స్టాప్ లైన్ దాటకుండా చూడడం, ఉల్లంఘనలు పాటించని వాహనదారుల ఫొటోలు తీయడం వంటివి చేస్తున్నారు. అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లలో కూడా మహిళా వాహనదారులకు పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఐటీ కారిడార్‌లలో వీకెండ్‌లలో మద్యం మత్తులో వాహనాలను నడిపిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతున్నట్లు గ్రహించిన ఉన్నతాధికారులు వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.

First woman traffic constable: Kavitha tweets

మరో వైపు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్న వాహనదారులు నిత్యంసిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఐటీ కారిడార్‌లో అధికంగా ఉండడంతో వాటికి చెక్ పెట్టేందుకు మహిళా కానిస్టేబుళ్ల ద్వారా దృశ్యాలను చిత్రికరించేందుకు సరికొత్త వ్యూహాన్ని సైబరాబాద్ పోలీసులు రచించారు.

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ రంగంలోకి స్త్రీలు అడుగు పెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కవిత హర్షించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదులో తొలిసారి మహిళ కానిస్టేబుళ్లు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి అని, మహిళా సాధికారతకు ఇది నిదర్శమని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+