బైక్‌తో ఢీకొట్టి సపర్యలు: తేరుకునేలాగా రూ.12లక్షలు, బైక్‌తో ఉడాయించారు
హైదరాబాద్: నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఓ వైపు చైన్ స్నాచింగ్‌లతో కొందరు భయందోళనలకు గురిచేస్తుంటే.. మరికొందరు దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొందరు దుండగులు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి.. వాహనం కింద పడటంతో మంచి వాళ్లలా కిందపడిన వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టి సపర్యలు చేశారు.
ఆ తర్వాత అదును చూసి కింద పడిన వ్యక్తి వాహనంతో సహా అందులో ఉన్న రూ.12 లక్షలను తీసుకొని ఉడాయించారు. ఈ ఘటన శనివారం రాత్రి తిలక్‌రోడ్డులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తిలక్‌రోడ్డులో ఉండే దివేష్(50) సిద్ధి అంబర్‌బజార్‌లో టైర్ల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం కూడా దుకాణాన్ని మూసివేసి హోండాపై రూ.12 లక్షలు తీసుకొని ఇంటికి బయలుదేరారు. ఆయన్ను వెంబడించిన ఇద్దరు వ్యక్తులు తిలక్‌రోడ్డులోని పోస్‌నెట్ భవనం వద్దకు రాగానే కైనెటిక్ హోండాను ఢీకొట్టడంతో దివేష్ కిందపడ్డారు.

కాగా, ఆయడ్ని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అందరిలాగే సపర్యలు చేసినట్లుగా నటించారు. అందరూ గుంపుగా చేరగానే హోండాతో సహా అందులో ఉన్న రూ.12 లక్షలతో ఉడాయించారు. కాస్త తేరుకున్నాకా వాహనం కోసం దివేష్ చూడగా అది కనిపించకపోవడంతో అసలు విషయం బయట పడింది. ఘటన స్థలాన్ని ఏసీపీ గిరిధర్, ఇన్‌స్పెక్టర్ శివ శంకర్, డీఐ వంశీకృష్ణ సందర్శించి.. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు.
ఐదుగురు నిందితుల అరెస్ట్
ఘటనపై బాధితుడు దివేష్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో దోపిడీకి పాల్పడిన ఐదుగురు నిందితులు పోలీసులకు చిక్కారు.












Click it and Unblock the Notifications