ఐదుగురు జనశక్తి నక్సలైట్ల అరెస్టు (ఫొటో)
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలోని రత్నగిరిపల్లి అటవీప్రాంతంలో ఐదుగురు జనశక్తి నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో జనశక్తిజిల్లా బాధ్యుడితో సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఎస్పీ ఎస్ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
గురువారం రత్నగిరిపల్లి అటవీప్రాంతంలో జనశక్తి పార్టీ సభ్యులు సమావేశమైనట్లు తెలుసుకుని డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో దాడి చేసి నిజామాబాద్ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శి వెంపటి కుమార్, ఏదులకంటి లింగారెడ్డి, జంగలం శంకర్, చందుపట్ల సురేష్, అక్కల రాజులను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రెండు తపంచాలు, కంట్రీమేడ్ రివాల్వర్, పిస్టల్ చేసుకున్నారు. వీరికి సహకరించిన శంకర్, సానుభూతి పరులపై కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిజామాబాద్లో పట్టుబడిన జనశక్తి నేతలను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పట్టుబడిన ఐదుగురితోపాటురాష్ట్ర కమిటీ నేతలైన కూర రాజన్న, దేవేందర్, విమలక్క, విఠల్రాజులతో కలిసి మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications