Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి.

హైదరాబాద్: కరీంనగర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలపాలవగా.. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సును ఢీకొన్న లారీ అంతటితో ఆగకుండా బస్సు వెనుకే వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను సైతం ఢీకొంది. దీంతో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సు వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తుండగా.. లారీ కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తోంది.

five killed in lorry bus collision in karimnagar

రెండు లారీలు ఒకదానికొకటి ఓవర్‌టేక్‌ చేసుకుంటూ రావడమే ప్రమాదానికి అసలు కారణమని చెబుతున్నారు. ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ అదుపు తప్పి బస్సు మధ్య భాగాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. దీంతో బస్సు నుజ్జునుజ్జవగా..ప్రయాణికుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాద ప్రాంతంలో మృతుల శరీర భాగాలు, రక్తంతో భీతావహంగా మారింది.

లారీ అతివేగంతో రావడం, రహదారి మధ్యలో డివైడర్‌ లేకపోవడమే ఈ ప్రమాదానికి పోలీసులు చెబుతున్నారు. బస్సు నుజ్జునుజ్జవడంతో అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

five killed in lorry bus collision in karimnagar

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్,రిమ్మనగూడ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో 13మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ప్రమాద స్థలానికి మంత్రి ఈటెల:

ప్రమాద సమాచారం తెలియగానే మంత్రి ఈటల రాజేందర్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామన్నారు. ఈ ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్‌ అతివేగమే కారణమని మంత్రి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+